బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ హీరో సినిమా రిలీజ్
అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మలయాళం స్టార్ మమ్ముట్టి హీరోగా రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో 'భ్రమయుగం' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
బీసీ కాలం బ్లాంక్ అండ్ వైట్ సినిమాల గురించి తెలిసిందే. కలర్ ప్రింట్ లేని సమయంలో సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే రిలీజ్ అయ్యేవి. కాల క్రమంలో సాంకేతికంగా వృద్దిలోకి రావడంతో సినిమా కలర్ రూపంలోకి మారింది. అయితే తాజాగా ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్ లో రిలీజ్ చేయ డానికి సన్నాహాలు చేస్తోంది టీమ్. ఈ ఐడియా ఎందుకు వచ్చింది? అన్నది తెలియదుగానీ 2024 లో ఓ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ లో రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.
ఆ సినిమా ఏంటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మలయాళం స్టార్ మమ్ముట్టి హీరోగా రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో 'భ్రమయుగం' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియాలో చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1960వ దశకంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఆ ప్రచార చిత్రాలన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్లో ఉండటం విశేషం. సినిమాలో పాత్రలన్నీ ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ లోనే రివీల్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా అలాగే హైలైట్ అయింది. అయితే ఇది కేవలం ప్రచార పరంగా అలా డిజైన్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడీ చిత్రాన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ లో నే రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
60వ దశకంలో ఫీల్ తీసుకురావాలి అంటే బ్లాక్ అండ్ వైట్ పార్మెట్ అయితేనే బాగుంటుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి కన్పర్మేషన్ ఇచ్చి ఈ విషయాన్ని రివీల్ చేసారు. నైట్ షిప్ట్ స్టూడియోస్-వైనాట్ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.