బుచ్చిబాబు.. బన్నీ గురించి ఎందుకు చెప్పలేదు?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు తనకంటూ ఎలాంటి ఫేమ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు తనకంటూ ఎలాంటి ఫేమ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. తొలి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రూ.100 కోట్ల హిట్ ను డెబ్యూతోనే సాధించిన డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో సరైన దర్శకుడు దొరికారని సినీ ప్రియులు, ఆడియన్స్ అంతా అభిప్రాయపడ్డారు.
ఉప్పెన తర్వాత బుచ్చిబాబు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. ఏమైందో తెలియదు కానీ ఆ కాంబో సెట్ కాలేదు. ఆ తర్వాత స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మైసూరులో RC 16 షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో మూవీ రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నా.. ఎలాంటి క్లారిటీ లేదు. క్యాస్టింగ్ ను చూస్తుంటే సినిమా భారీగా ఉండనున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో అంతా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. అది పక్కన పెడితే.. బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు అన్న విషయం తెలిసిందే.
దీంతో సుకుమార్ సినిమాల ఈవెంట్స్ కు బుచ్చి బాబు అటెండ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. వేదికపై మాట్లాడారు కూడా. తన గురువు సుకుమార్ ను ఓ రేంజ్ లో కొనియాడారు. పుష్ప ఒక బ్రాండ్ అని.. దానికి పబ్లిసిటీ అవసరం లేదని అన్నారు. ప్రజలు ఎక్కువ మాట్లాడుకునే మూవీ అదేనని అన్నారు.
సుక్కూ సార్ కష్టం తనకు తెలుసని చెప్పారు. తాము 20, 25 వెర్షన్లు రాసి అలసిపోయి ఆపేస్తామని, కానీ మీరు అక్కడి నుంచి మొదలు పెడతారని అన్నారు. ఆయన నుంచి ఎప్పుడూ నేర్చుకుంటామని తెలిపారు. సినిమా విజయం సాధించాలని, నిర్మాతలకు మంచి లాభాలు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు బుచ్చిబాబు.
అయితే తన స్పీచ్ లో అసలు అల్లు అర్జున్ ప్రస్తావనే తీసుకురాకపోవడం గమనార్హం. ఇప్పుడు ఆ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుచ్చిబాబు చాలా తెలివిగా మాట్లాడారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆయన కావాలనే బన్నీ పేరును ప్రస్తావించకపోయి ఉంటారని కొందరు మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే అది నిజమని చెప్పలేమని మరికొందరు చెబుతున్నారు. బుచ్చిబాబు ఎప్పుడూ స్టేజ్ పై తక్కువ గానే మాట్లాడుతారని గుర్తు చేస్తున్నారు. దానికి తోడు ఈవెంట్ టైమ్ కూడా బాగా లేట్ అయింది. అందుకే అల్లు అర్జున్ టాపిక్ ను రైజ్ చేయకుండా.. గురువు కోసమే మాట్లాడి ఉంటారని అంటున్నారు.