తండేల్.. చైతూ ఎంత కష్టపడుతున్నాడంటే..

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బన్నీ వాస్ ఈ ‘తండేల్’ మూవీలో నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-22 04:11 GMT

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథని సిద్ధం చేశారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ రెడీ అవుతోంది. ఇందులో నాగ చైతన్య రాజు అనే రియల్ లైఫ్ ఫిషర్ మెన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అతని లైఫ్ లో జరిగిన సంఘటనలతోనే ఈ కథ ఉంటుందంట.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజు క్యారెక్టర్ కోసం నాగ చైతన్య తన లుక్ పూర్తిగా చేంజ్ చేసుకున్నాడు. ఫుల్ గా మేకోవర్ అయ్యి ఆ క్యారెక్టర్ ని చేస్తున్నారు. దీనికోసం ఉత్తరాంధ్ర స్లాంగ్ కూడా నేర్చుకున్నారు. దాంట్లోనే చైతన్య డైలాగ్స్ కూడా ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బన్నీ వాస్ ఈ ‘తండేల్’ మూవీలో నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా కోసం నాగ చైతన్య తనని తాను చాలా వరకు తగ్గించుకున్నాడు. పూర్తిగా రాజు క్యారెక్టర్ ని అర్ధం చేసుకొని ఒక సామాన్య వ్యక్తిగా మారిపోయాడు. అతను అన్ని వదిలేసుకున్నాడు. నేను నాగార్జున అబ్బాయిని, స్టార్ హీరోని, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అనే ఆలోచనలు అన్ని వదిలేసాడు. ఈ సినిమాతో ఏదో అచీవ్ చేయాలనే కసితో కనిపించారు. సామాన్యులకి కనెక్ట్ అవ్వాలంటే నేను కూడా కామన్ మెన్ కావాలి అనే మైండ్ తో నటిస్తున్నారు.

రాజు అనే క్యారెక్టర్ కోసం పూర్తిగా క్రిందికి వెళ్ళిపోయి ఆ పాత్రలో ఒదిగిపోయారని బన్నీ వాస్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా ‘తండేల్’ సినిమాలో సరికొత్త నాగ చైతన్యని ఆడియన్స్ చూస్తారని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. ‘తండేల్’ మూవీలో నాగ చైతన్య లుక్స్ చూస్తుంటే క్యారెక్టర్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే సినిమాపైనే కూడా పాజిటివ్ వైబ్ ఉంది.

మరి చైతన్యకి ‘తండేల్’ ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి. మరో వైపు అక్కినేని అఖిల్ కూడా నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. లుక్ చేంజ్ చేసేసాడు. సక్సెస్ కొట్టాకే మరల మీడియా ముందుకి రావాలని ఫిక్స్ అయిపోయాడు.

Tags:    

Similar News