నాగచైతన్య-శోభిత పెళ్లి కి లాంగ్ గ్యాప్!
ఇటీవలే నాగచైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్దం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది
ఇటీవలే నాగచైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్దం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. దీంతో పెళ్లి తేదీ ఎప్పుడు అన్న చర్చా మొదలైంది. అలాగే వివాహం కూడా సింపుల్ గా జరుగుతుందా? అంరంగ వైభవంగా నిర్వహిస్తారా? అన్న అంశం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ వర్గాల నుంచి కొన్ని లీకులందుతున్నాయి.
ఈ ఏడాది చివర్లో అనగా డిసెంబర్లో ఓ తేదీ అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే వచ్చే ఏడాది మార్చి లో కూడా మరో ముహూర్తం చూస్తున్నట్లు తెలుస్తోంది. వివాహం ఎప్పుడు జరిగినా రాజాస్తాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. రెండు కుటుంబాలు చర్చించుకుని పెళ్లి తేదీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే నిశ్చితార్దం తర్వాత వివాహానికి ఎక్కువ గ్యాప్ వస్తున్నట్లు కనిపిస్తుంది.
డిసెంబర్ అనుకుంటే ఆరు నెలలు సమయం పడుతుంది. అదే మార్చి తేదీ ఫిక్స్ చేస్తే తొమ్మిది నెలలు సమయం ఉంటుంది. మరి ఇంత లాంగ్ గ్యాప్ కి కారణం ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. శ్రావణ మాసం, కార్తీక మాసంలో కూడా వివాహాలు జరుగుతాయి. కానీ బలమైన ముహూర్తాలు ఉండవు అనే ఆరోపణ ఉంది. మరి ఆ కోణంలో డిసెంబర్- మార్చి వరకూ వెయిట్ చేస్తున్నారా? లేక ఇంకేవైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాలి.
అయితే ఇలా సమయం దొరకడం అన్నది మంచికే. ఒకర్ని ఒకరు మరింతగా అర్దం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా `తండేల్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.