బికినీలో అందాల చంద్రిక.. మైండ్ బ్లోయింగ్
వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య సరసన ఐటెం సాంగ్ లో చిందులేసి ఒక్కసారి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది.
'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' అంటూ తెలుగు సినీ ప్రియులను గతేడాది ఊపు ఊపేసింది చంద్రిక రవి. వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య సరసన ఐటెం సాంగ్ లో చిందులేసి ఒక్కసారి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. హనీ రోజ్ తో కలిసి ఓ రేంజ్ లో అలరించింది. ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. అంతకుముందు ఆమె ఒక తెలుగు సినిమా చేసింది. చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీలో కీలక పాత్ర పోషించింది.
ఇప్పుడు అలనాటి నటి సిల్క్ స్మిత బయోపిక్ చేస్తోంది ఈ అమ్మడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను కొత్త దర్శకుడు జానకి రామ్ తెరకెక్కిస్తున్నారు. సిల్క్ స్మిత ది అన్ టోల్డ్ స్టోరీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను కొన్ని నెలల క్రితం విడుదల చేశారు మేకర్స్. అందులో చంద్రిక అచ్చం స్మిత లాగే కనిపించింది. 2024లో ఈ మూవీ విడుదల అవ్వనున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా నుంచి అప్డేట్ రానుందట.
ఇక సోషల్ మీడియాలో చంద్రిక రవి గ్లామర్ ట్రీట్ మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు నయా పిక్స్ షేర్ చేస్తుంటోంది. ఘాటు అందాలతో మైమరపిస్తుంటోంది. తన పోజులతో కుర్రకారును కిర్రెక్కిస్తుంటోంది. నెటిజన్ల మతులు పోగుడుతుంటోంది. బికినీలు, పొట్టి డ్రెస్సుల్లో చంద్రిక స్కిన్ షో వేరే లెవల్ లో ఉంటోంది. అప్పుడప్పుడు చీరల్లో కూడా అందాలు ఆరబోస్తుంటోంది. సింపుల్ గా అందరినీ మైండ్ బ్లాక్ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో మతిపోగొట్టే పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న చంద్రిక.. స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. స్కై బ్లూ కలర్ బికినీలో సెగలు పుట్టించింది. పై నుంచి సెల్ఫీ తీసుకుని ఎద అందాలతో కవ్విస్తోంది. సెకండ్ ఫోటో అయితే ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చంద్రిక ఎద అందాలకు అల్లాడిపోతున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి సోషల్ మీడియాలో తన ఫోటోలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది చంద్రిక రవి. ఆస్ట్రేలియాలో జన్మించిన చంద్రిక.. లాస్ ఏంజిల్స్ లో మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2012లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా ఆస్ట్రేలియా ఫైనలిస్ట్ గా నిలిచింది. 2014లో మిస్ మాగ్జిమ్ ఇండియాలో రన్నరప్ టైటిల్ ను గెలుచుకుంది. మరి సిల్క్ స్మిత బయోపిక్ తో చంద్రిక ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.