క్రికెటర్ హార్థిక్ పాండ్యతో చరణ్ NYE పార్టీ
చరణ్ ఐఏఎస్ గా, సీఎంగా తన పాత్ర లో ఎంతగా ఒదిగిపోయాడో శంకర్ ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా పాన్ ఇండియన్ ఆడియెన్ ని అలరించేందుకు బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ రిలీజైంది. చరణ్ ఐఏఎస్ గా, సీఎంగా తన పాత్ర లో ఎంతగా ఒదిగిపోయాడో శంకర్ ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంది. ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. రూబెన్ ఎడిటింగ్ శైలి అందరికీ నచ్చింది.
ఓవైపు ట్రైలర్ ఈవెంట్ గురించి చర్చ సాగుతుండగా, రామ్ చరణ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో చర్చగా మారాయి. దీనికి కారణం అతడు ఈసారి కొత్త సంవత్సర వేడుకలను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసారని తాజాగా రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి. యువ క్రికెటర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి చరణ్ ఈసారి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేసారు.
చరణ్ ఎప్పటిలానే ఈ ఫోటోల్లో స్టైలిష్ గా కనిపించాడు. అయితే అతడు బాగా గడ్డం మీసం పెంచాడు. గిరజాల జుత్తు కూడా పెరిగింది. ఈ లుక్ తదుపరి బుచ్చిబాబు సినిమా కోసం అని అర్థమవుతోంది. ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. చరణ్ క్రికెటర్లతో కలిసి పార్టీ చేసుకున్న మాట నిజమే కానీ, ఈ ఎన్.వై.ఇ పార్టీ ఎక్కడ జరిగింది? పార్టీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. చరణ్ చాలామంది క్రికెటర్లకు సన్నిహితుడు. వారితో వీలున్న సందర్భాల్లో కలుస్తుంటాడు. ప్రస్తుతం చరణ్ తన సినిమా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.