ప్రభాస్ తో కొడితే చిరంజీవి క్లియరెన్స్!
మారుతితో సినిమా చేస్తానని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈప్రకటన వచ్చి చాలా కాలమవుతుంది.
మారుతితో సినిమా చేస్తానని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈప్రకటన వచ్చి చాలా కాలమవుతుంది. కానీ మారుతితో మాత్రం ఇంకా చిరంజీవి సినిమా చేయలేదు. ఎలాంటి ప్రకటనలు లేని శ్రీకాంత్ ఓదెల, అనీల్ రావిపూడితో చిరు సినిమాలు ప్రకటించారు. అవి ఇప్పుడు లైనప్ లో ఉన్నాయి. అనీల్ సినిమాతో పాటు శ్రీకాంత్ సినిమా కూడా ఒకేసారి పట్టాలెక్కుతుంది. మరి మారుతితో చిరంజీవి సినిమా ఎప్పుడు అంటే? ముందుగా మారుతి హిట్తో నిరూపించుకున్న తర్వాతే సినిమా చేసే అవకాశం ఉంది.
అంత వరకూ మారుతితో చిరంజీవి సినిమా చేసే అవకాశం లేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ `రాజాసాబ్` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మారుతిని నమ్మి ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ని పక్కనబెట్టి మరీ చేస్తోన్న చిత్రమిది. మారుతిమార్క్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. హారర్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ లో నే ఉంది. ప్రభాస్ పాన్ ఇండియాలో వేర్వేరు సినిమాలు చేస్తూనే మధ్యలో దొరికిన సమయంలో మాత్రమే `రాజాసాబ్` షూటింగ్ కి వెళ్తున్నారు.
ఆ కారణంగా రాజాసాబ్ ఇంకాసెట్స్లోనే మూలుగుతోంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది ఇంతవరకూ సరైన క్లారిటీ లేదు. ఈ ఏప్రిల్ లో రిలీజ్ అనే ప్రచారం ఉంది. కానీ అది జరుగుతుందా? లేదా? అన్న సందేహం కూడా అంతే బలంగా తెరపైకి వస్తోంది. ఇక చిరంజీవి మారుతికి ఛాన్స్ ఇవ్వాలి అంటే `రాజాసాబ్` తో మారుతి ప్రూవ్ చేసుకోవాలి. ప్రభాస్ కి భారీ హిట్ ఇస్తేచిరంజీవి మరో ఆలోచన లేకుండా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
అంతేగానీ ప్రభాస్ లా మాత్రం చిరంజీవి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదని వినిపిస్తుంది. చిరంజీవి బలంగా నమ్మి ఉంటే ఇప్పటికే మారుతికి ఆఛాన్స్ వచ్చేదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మారుతి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ని `బాబు బంగారం`తో డైరెక్ట్ చేసారు. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత తరం హీరోల్లో మారుతి డైరెక్ట్ చేస్తోన్న పెద్ద స్టార్ ఎవరంటే? అది ప్రభాస్ మాత్రమే.