సింగిల్ సిట్టింగ్ లో మెగా సిగ్నల్

మెగాస్టార్ చిరు శ్రీకాంత్ ఒదెలతో కలిసి పనిచేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-02 06:50 GMT

మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపికలో కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా ప్రతి సినిమా కోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత లైనప్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా మరో ప్రతిభావంతుడైన దర్శకుడితో మెగా కాంబినేషన్ ను ఫిక్స్ చేసుకున్నారు.

మెగాస్టార్ చిరు శ్రీకాంత్ ఒదెలతో కలిసి పనిచేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ప్రొడక్షన్ హౌస్ కూడా సెట్టయ్యింది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనుండగా, భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు సమాచారం. ‘దసరా’ సినిమాతో శ్రీకాంత్ ఒదెల తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆయన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఇక మెగాస్టార్ పర్ఫెక్ట్ గా కథ నచ్చితేనే ఆమోదిస్తారు. అయితే, శ్రీకాంత్ చెప్పిన కథను చిరంజీవి ఒకే సిట్టింగ్‌లోనే ఆమోదించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ శ్రీకాంత్ ఒదెలకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. చిరంజీవితో సినిమా చేయడం ఏ దర్శకుడికైనా ఒక గొప్ప డ్రీమ్. ఇటీవల సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘భగవంత్ కేసరి’ అద్భుత విజయం సాధించింది. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ చిత్రం నిర్మితమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక చిరంజీవి-శ్రీకాంత్ ఒదెల సినిమా మొదలవుతుంది.

నానితో సినిమాను కూడా శ్రీకాంత్ ఒదెలే డైరెక్ట్ చేస్తున్నారు. ఇది SLV సినిమాస్ బ్యానర్‌పై మరో భారీ ప్రయత్నం అని చెప్పొచ్చు. ఇక చిరంజీవితో చేయబోయే సినిమాలో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట. మెగాస్టార్ పూర్తిగా కొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే భిన్నమైన పాత్రల్లో మెప్పించిన చిరంజీవి ఈ చిత్రంలో మరోసారి తన నటనా వైవిధ్యాన్ని చూపించనున్నారు. చిరంజీవి ఇప్పటివరకు చేయని పాత్రలో నటించనున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రం మెగాస్టార్ అభిమానుల అంచనాలను మించిన కంటెంట్ ను సాధిస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకమైన ప్లాన్ తో రూపొందనున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది. కథ, కథనాలు, నిర్మాణ విలువల విషయంలో ఈ ప్రాజెక్ట్ పాన్-ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో అప్డేట్ త్వరలోనే వెలువడనుంది.

Tags:    

Similar News