చిరు మౌనవృతం బూత్ వరకేనా?
రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వసిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో తన #మెగా156 చిత్రీకరణలో చేరారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా విశ్వంబర అనే టైటిల్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. దీని తర్వాత సినిమాలపైనా చిరు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని సమాచారం.
ఇంతలోనే తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ హంగామా తెలిసిందే. ఇదిగో ఇలా ఓటు వేయడానికి మెగాస్టార్ చిరంజీవి షూటింగు నుండి విరామం తీసుకున్నారు. తన భార్య సురేఖ, కుమార్తెతో కలిసి జూబ్లీహిల్స్‌లోని 149 బూత్‌కు వచ్చారు. అయితే పోలింగ్ బూత్ వద్ద తనతో సంభాషించేందుకు, ప్రశ్నలు అడిగేందుకు ఒక ఔత్సాహిక జర్నలిస్ట్ మౌత్ పట్టుకుని నిలుచుకున్నారు. చిరును ఎన్నికల శైలి గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.
అయితే ఆ సమయంలో దీని గురించి ఏం మాట్లాడాలన్నా ఇబ్బందికరం. దీంతో తాను మౌనవృతంలో ఉన్నానని చిరు అన్నారు. అయినా ఇంకా వెంటపడుతూ ప్రశ్నిస్తున్న జర్నలిస్టుకు తన గొంతు బాగోలేదని చిరు సైగ చేస్తున్న వైనం అందరినీ నవ్వించింది. నిజానికి ఇది చిరు మార్క్ స్పందన. ఆయనలోని స్పాంటేనియస్ హాస్య చతురత ఎలాంటిదో చెబుతుంది. ఎదుటివారి మనోభావాలను ఎంతమాత్రం గాయపరచకుండా తనదైన శైలిలో చిరు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఔత్సాహిక జర్నలిస్టు తన కెమెరామెన్తో కలిసి ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయాలని తపించిన తీరు కూడా ఆకట్టుకుంది. అంతేకాదు సెలబ్రిటీల నుంచి ఏదైనా సమాధానం పొందాలంటే ఎంతగా ఎదురు చూపులు చూడాలో కూడా ఈ సన్నివేశం అర్థమయ్యేలా చెప్పింది. మెగాస్టార్ ఇటీవల స్వామి మాల వేసి ధీక్ష బూనారు. పోలింగ్ బూత్ కి అయ్యప్ప దుస్తుల్లోనే విచ్చేసారు.