ఇన్నాళ్ళకు మెగా 'దిల్' కాంబో

దిల్ రాజు.. త్వరలోనే మెగా స్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం అందింది

Update: 2023-08-09 05:33 GMT

వెంకట రమణా రెడ్డి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. దిల్‌ రాజు అంటే సినీ పరిశ్రమలో తెలియని వారే ఉండకపోవచ్చు. కెరీర్ లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని డిస్ట్రిబ్యూటర్‌గా, ఆ తర్వాత నిర్మాతగా మారారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై.. ఓ వైపు స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తూనే.. మరోవైపు కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమాలనూ ప్రోత్సహిస్తూ కెరీర్ లో ముందుకు దూసుకువెళ్తున్నారు.

అలా 2003 నుంచి సినీ నిర్మాణ రంగంలో ఓ చెరగని ముద్ర వేశారు దిల్ రాజు. శతమానం భవతితో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న ఆయన.. రీసెంట్ గా తన సమర్పణలో వచ్చిన బలగంతో అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నారు.అయితే తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన.. ఇద్దరు అగ్ర నటులతో మాత్రం సినిమా చేయలేకపోయారు. వారే మెగా స్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ.

అయితే ఇప్పుడు రానున్న రోజుల్లోనూ మంచి కథా చిత్రాలను తెరకెక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్న దిల్ రాజు.. త్వరలోనే మెగా స్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం అందింది. త్వరలోనే ఆయన బ్యానర్ పై చిరుతో కలిసి సినిమా చేస్తారని ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని, చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

ఈ సినిమాకు డైెరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం అనిల్.. బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' సినిమా చేస్తున్నారు. ఇది అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా పూర్తవ్వగానే చిరుతో సినిమా చేస్తారని ఇన్ సైడ్ టాక్. చిరు కోసం ఓ సాలిడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.

ఇకపోతే చిరంజీవిలో ఫన్ యాంగిల్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆయనకు ఊపు రావాలేగాని.. ఫన్ యాంగిల్ పీక్స్ లో ఉంటుంది. రీసెంట్ రిలీజైన వాల్తేరు వీరయ్యలో మస్త్ కామెడీ పండించారు. భోళా శంకర్ లోనూ అలాంటి కామెడీయే చేశారని ఇప్పటికే అర్థమైపోయింది. ఇక చిరు ఫన్ యాంగిల్ కు అనిల్ మార్క్ కామెడీ తోడైతే ఆ ఫన్ ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్ లో ఉంటందని చెప్పొచ్చు.

Tags:    

Similar News