నోలన్.. రెమ్యునరేషన్ తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే
రీసెంట్ గా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రమే మెయిన్ హైలైట్ గా నిలిచింది.
ప్రపంచ సినిమా గురించి తెలిసిన ఎవరికైనా క్రిస్టోఫర్ నోలన్ అంటే వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. హైలీ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ గా హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రిస్టోఫర్ నోలన్ క్రియేట్ చేసుకున్నారు. రెగ్యులర్ హాలీవుడ్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా హై స్టాండర్డ్స్ థాట్స్, స్క్రీన్ ప్లే తో క్రిస్టోఫర్ మూవీస్ ఉంటాయి. అందుకే అతనికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ స్టోరీ ఏది తీసుకున్న ఇతర దర్శకులకి భిన్నంగా కథని నేరేట్ చేయడం క్రిస్టోఫర్ స్టైల్
గత ఏడాది ఓపెన్ హైమర్ మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అణుబాంబుని సృష్టించిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. క్రిస్టోఫర్ నోలన్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఓపెన్ హైమర్ మరోసారి ప్రూవ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
రీసెంట్ గా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రమే మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను క్రిస్టోఫర్ నోలన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తోంది. 100 మిలియన్ డాలర్స్ ని ఓపెన్ హైమర్ సినిమాకి క్రిస్టోఫర్ రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. ఇండియన్ కరెన్సీలో సుమారు 800 కోట్ల రూపాయిలు దర్శకుడిగా ఆయన అందుకున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న దర్శకులుగా జేమ్స్ కామెరూన్, క్రిస్టోఫర్ నోలన్ ఉన్నారు. ఓపెన్ హైమర్ సినిమాకి అన్ని భాషలలో మంచి ఆదరణ లభించింది. చివరిగా గత ఏడాది టెనెట్ అనే మూవీ చీసి హిట్ కొట్టాడు. క్రిస్టోఫర్ ఇమేజ్ కారణంగానే ప్రొడక్షన్ హౌస్ లో అతనికి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ప్రపంచ దేశాలలో అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇండియాలో కూడా క్రిస్టోఫర్ సినిమాలు అంటే ఆడియన్స్ ఎగబడి థియేటర్స్ కి వెళ్తారు.
1998లో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన క్రిస్టోఫర్ ఇప్పటి వరకు 12 సినిమాలు మాత్రమే చేశారు. వాటిలో బ్యాట్ మెన్ సిరీస్, ఇంటర్ స్టెల్లర్, ఇన్సెప్షన్ మూవీస్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కి హిట్ అయ్యాయి. అతను చేసిన మొమెంటో సినిమా ఆధారంగానే మురుగదాస్ గజినీ మూవీ చేశాడు. ఇక నెక్స్ట్ ఆయన ఎలాంటి సినిమాతో వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.