పాతిక ప్రాయం కూతురిని ఆపే ధైర్యం లేదన్న నటుడు!
ఎవరి సహాయం లేకుండానే బాలీవుడ్‌లో తన కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నందుకు అనన్యను ప్రశంసించాడు.
ప్రతిరోజూ మీడియాలో తన కుమార్తె ఎఫైర్ గురించి కథనాలు వెలువడుతుంటే... ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? హిందీ చిత్రసీమలో 90ల నాటి ప్రముఖ బాలీవుడ్ నటుల్లో ఒకరైన చుంకీ పాండేకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన కుమార్తె అనన్య పాండే -ఆదిత్య రాయ్ కపూర్ జంట ప్రేమాయణం, రొమాన్స్ గురించి నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో సంచలన కథనాలు వెలువడ్డాయి. దీనిపై చంకీ ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. చంకీ పాండే తన కుమార్తె నిర్ణయాలను అంగీకరిస్తున్నానని, తన 25 ఏళ్ల కుమార్తెను నియంత్రించే ధైర్యం చేయలేదని పేర్కొన్నాడు. ఎవరి సహాయం లేకుండానే బాలీవుడ్‌లో తన కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నందుకు అనన్యను ప్రశంసించాడు.
తాజా ఇంటర్వ్యూలో అనన్య డేటింగ్ వ్యవహారం గురించి చంకీని ప్రశ్నించారు. దానికి అతడు స్పందిస్తూ.. ''నా ఉద్దేశ్యం బాగానే ఉంది. అనన్య వయస్సు 25 అనుకుంటా. తను నా కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది. కోరుకున్నది చేయడానికి తనకు స్వేచ్ఛ ఉంది. నా 25 ఏళ్ల కుమార్తెకు ఏం చేయాలో చెబుతూ నియంత్రించే ధైర్యం చేయలేదు'' అని అన్నారు.
సినిమాల్లో తన కుమార్తె ఇంటిమేట్ సన్నివేశాలు చేయడం గురించి చంకీ పాండే ముక్తసరిగా మాట్లాడుతూ ''అవును... నేను బాగానే ఉన్నాను. హాలీవుడ్‌లో ఇలాంటివి చూశాను. హాని లేదు. మీరు దానిని అంగీకరించాలి'' అని అన్నారు. తన ఇద్దరు కుమార్తెలు స్వేచ్ఛగా ఉన్నారని పాండే తెలిపారు. ఏదైనా అవసరమైనప్పుడు వారి నుండి తనకు కాల్ వస్తుందని కూడా వెల్లడించాడు. కాకపోతే వాళ్ళు అమ్మతో చాలా క్లోజ్ గా ఉంటారు. తన కుమార్తెలకు ఏదైనా సలహా అవసరమైనప్పుడు తాను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని చెప్పాడు. నేను ఓల్డ్ స్కూల్ కాబట్టి, సినిమాలు, ప్రాజెక్ట్‌లపై ఆలోచనల విషయానికి వస్తే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పాడు.
తన మొదటి సినిమా అవకాశం దక్కించుకోవడంపై చంకీ ప్రశంసలు కురిపించారు. అనన్య తన మొదటి చిత్రాన్ని గెలుచుకున్నప్పుడు గర్వించదగిన క్షణం అని అన్నారు. ఆడిషన్ చేసేవాళ్లు తనను మొదటి సారి చాలా చిన్న వయస్సులో ప్రతిభను గుర్తించారని అనుకుంటున్నాను. తను ఆడిషన్ కోసం వెళ్ళింది. ఆమెకు సినిమాలో అవకాశం వచ్చింది'' అని తెలిపారు.
స్టడీస్ కోసం న్యూయార్క్ .. LA కళాశాలలలో కూడా అనన్య ప్రవేశించింది. మా కుటుంబంపై అప్పటికి ఒత్తిడి ఉంది. నేను తన కోసం కాలేజీలో అడ్మిషన్‌ను 6 నెలల పాటు హోల్డ్ లో ఉంచగలిగాను. నేను కొన్ని 500 డాలర్లు చెల్లించి ఉంచాను. ఎందుకంటే ఎవరికి తెలుసు... సినిమా వర్కవుట్ కాకపోతే.. కాబట్టి అది గర్వించదగిన క్షణం. తను సొంతంగా ఆ చిత్రాన్ని పొందింది'' అని తెలిపాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనన్య చివరిగా సిద్ధాంత్ చతుర్వేది- ఆదర్శ్ గౌరవ్‌లతో కలిసి 'ఖో గయే హమ్ కహాన్' చిత్రంలో కనిపించింది. తదుపరి OTT వెబ్ సిరీస్ 'కాల్ మీ బే'లో కనిపించనుంది. 'జలియన్ వాలా బాగ్' ఊచకోత బాధితుల కోసం పోరాడిన న్యాయవాది, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సి శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా కరణ్ జోహార్ సమర్పణలోని చిత్రం కూడా చేస్తోంది.