ఒక టైటిల్.. ఇద్దరి హీరోల గొడవ..!

ఇలా టాలీవుడ్ లో చాలామంది హీరోలు తమ కోసం రిజిస్టర్ చేసుకున్న టైటిల్స్ కూడా వదిలేయాల్సి వచ్చింది.

Update: 2025-01-29 12:15 GMT

సినిమాకు యాప్ట్ టైటిల్ అనేది చాలా ముఖ్యం. థియేటర్ కు ప్రేక్షకులను రప్పించేందుకు ఈ టైటిల్ కూడా ఒక కారణం అవుతుంది. అంతేకాదు కొన్ని సినిమాలకు టైటిల్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఫలితాలు తారుమారైన పరిస్థితులు ఉన్నాయి. ఐతే ఒక సినిమాకు ఒక టైటిల్ ఫిక్స్ చేస్తే మళ్లీ ఆ టైటిల్ జోలికి వేరే వాళ్లు వెళ్లరు. ఇలా టాలీవుడ్ లో చాలామంది హీరోలు తమ కోసం రిజిస్టర్ చేసుకున్న టైటిల్స్ కూడా వదిలేయాల్సి వచ్చింది.

ఐతే కోలీవుడ్ లో ఇద్దరి హీరోల సినిమాలకు ఒకే టైటిల్ పెట్టి షాక్ ఇచ్చారు. అదేంటి అదెలా పెడతారని అనుకోవచ్చు. తమిళ్ లో శివ కార్తికేయన్ సుధ కొంగర క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాకు పరాశక్తి అనే టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ఇంకా టీజర్ కూడా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇక మరోపక్క విజయ్ ఆంటోని నటిస్తున్న 25వ సినిమాకు తెలుగు టైటిల్ గా పరాశక్తి అని ఫిక్స్ చేశారు. ఐతే ఆ సినిమాకు తమిళ్ లో శక్తి తిరుమగన్ అని పెట్టగా తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఆ సినిమాకు పరాశక్తి అని టైటిల్ పెట్టారు.

సో పరాశక్తి టైటిల్ తో అటు శివ కార్తికేయన్ ఒక సినిమా.. విజయ్ ఆంటోని ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండిటిలో విజయ్ ఆంటోని సినిమానే ముందు రిలీజ్ లాక్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే పరాశక్తి టైటిల్ 1952 లో వచ్చిన తమిళ క్లాసిక్ సినిమాకు పెట్టారు. ఈ క్రమంలో చెన్నైలోని శివాజీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ టైటిల్ వేరే వాళ్లు ఎవరు వాడుకోవద్దని అభ్యంతరం తెలుపుతున్నారు.

మరి ఈ టైటిల్ ఇష్యూపై రెండు సినిమాల దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తరన్నది చూడాలి. రెండు సినిమాలకు ఈ టైటిల్ పెడుతున్నారనే కమ్యునికేషన్ లేదా తెలిసినా ఎవరు తగ్గట్లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే విజయ్ ఆంటోని తమిళ్ లో ఒక టైటిల్ తెలుగులో మరో టైటిల్ పెట్టగా శివ కార్తికేయన్ మాత్రం తన సినిమాకు అన్ని భాషల్లో పరాశక్తి టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. మరి ఈ టైటిల్ ఫైట్ ఎలా సాల్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News