రూటు మార్చాడు.. రఫ్ఫాడిస్తున్నాడు..!
తెలుగులో కూడా తన నెగిటివ్ షేడ్స్ పాత్రలతో అలరిస్తున్న సునీల్ ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం లో ఛాన్స్ అందుకున్నాడు.
టాలీవుడ్ కమెడియన్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న సునీల్ స్టార్ కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న టైం లోనే హీరోగా టర్న్ తీసుకున్నాడు. హీరోల పక్కన కమెడియన్ గా చేసిన సునీల్ అదే హీరోలకు పోటీగా హీరోగా మారాడు. అయితే హీరోగా మారినప్పటి నుంచి అతని కెరీర్ మొదట్లో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత మాత్రం నిరాశపరచింది. హీరోగా దాదాపు ఖాళీ అనుకున్న టైం లో మళ్లీ తన మునుపటి రూపాన్ని తెచ్చుకుని మళ్లీ కామెడీ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు.
ఈ టైం లోనే సునీల్ కు విలన్ గా మారాలన్న ఆలోచన వచ్చింది. కమెడియన్ నుంచి హీరో.. మళ్లీ హీరో నుంచి కమెడియన్ గా మారిన సునీల్ ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని విలన్ గా చేస్తూ వచ్చాడు. పుష్ప సినిమాలో అతన్ని విలన్ గా చూసిన ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. ఇక అప్పటి నుంచి సునీల్ కు వరుస వెరైటీ అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళ పరిశ్రమ నుంచి సునీల్ కి డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి.
ఆల్రెడీ శివ కార్తికేయన్ మహావీరన్ లో నటించిన సునీల్ రజినికాంత్ జైలర్ లో కూడా నటించాడు. ఇక రీసెంట్ గా వచ్చిన మార్క్ ఆంటోనీ లో కూడా మెప్పించాడు సునీల్. తమిళంలో వరుస అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం సౌత్ లోనే హయ్యెస్ట్ పెయిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ తన హవా కొనసాగిస్తున్నాడు. ఏ పాత్ర చేసినా సినిమాల్లో ఉండాలన్న సునీల్ బలమైన కోరికే అతన్ని ఇలా ఇన్ని షేడ్స్ లో ఆడియన్స్ కు పరిచయం చేస్తుంది.
తెలుగులో కూడా తన నెగిటివ్ షేడ్స్ పాత్రలతో అలరిస్తున్న సునీల్ ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం లో ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో సునీల్ రెగ్యులర్ పాత్రలో కనిపిస్తాడా లేదా వెరైటీగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.
తెలుగులో ఎలా ఉన్నా కోలీవుడ్ లో తను చేసిన పాత్రలకు వస్తున్న రెస్పాన్స్ చూసి సునీల్ కెరీర్ లో మళ్లీ నూతన ఉత్సాహాన్ని పొందుతున్నాడు. ఇదే జోష్ తో కోలీవుడ్ లో మరికొన్ని సినిమాలతో అదరగొట్టేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ రాబోతున్న పుష్ప 2 లో కూడా సునీల్ విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. సో సునీల్ విలనిజం సౌత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కొన్నాళ్లు సునీల్ ఈ విలన్ రోల్స్ తోనే మెప్పిస్తారని చెప్పొచ్చు.