ఈయన నేచురల్‌స్టార్..ఆయన నసీరుద్దీన్ షా
ముఖ్యంగా నాని తన స్నేహితుడు ప్రియదర్శి నట ప్రతిభను కొనియాడారు.;
''ఒక గ్రౌండెడ్ పెర్ఫార్మెన్స్ తో శక్తివంతమైన ప్రభావాన్ని చూపడం ఏ నటుడికైనా అత్యంత సవాల్‌తో కూడిన పని. దర్శి తక్కువ అంచనాలతో.. శక్తివంతమైన నటనతో తెలుగు సినీపరిశ్రమలో నసీరుద్దీన్ షాలా అలరిస్తున్నాడు'' అని ప్రశంసించారు నేచురల్ స్టార్ నాని. ప్రియదర్శి ప్రధాన పాత్రలో చిన్న బడ్జెట్ తో రూపొందించిన 'కోర్టు' మొదటి రోజున 8.10 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు మరింత బలంగా ఉంటుందని భరోసానిచ్చింది. విజయోత్సవ వేడుకలో నాని మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ముఖ్యంగా నాని తన స్నేహితుడు ప్రియదర్శి నట ప్రతిభను కొనియాడారు.
సినిమా విజయానికి నాని హర్షం వ్యక్తం చేసారు. నేను రెండు విషయాలను నమ్మాను. ఒకటి స్క్రిప్ట్, మరొకటి ప్రేక్షకులు. స్క్రిప్ట్ నా టీమ్ ని సక్సెస్ వైపు నడిపించగా, తెలుగు సినిమా వెలుగులకు కారణం ప్రేక్షకులే. సోషల్ మీడియాలో ప్రతిచోటా ప్రేమ కురిసింది. ''నేను కోర్ట్‌ను గెలిచానని ప్రజలు అంటున్నారు, కానీ నిజంగా కోర్ట్ నన్ను విజేతగా నిలిపిందని భావిస్తున్నాను. నా టీమ్ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దర్శకుడు జగదీష్ మొదటిసారి నాకు కథను చెప్పినప్పుడు అతడిలో మెరుపు కనిపించింది. ప్రజలు దీనిని 'శివాజీ పునరాగమనం' అని పిలుస్తారని విని నేను చాలా థ్రిల్ కి గురయ్యాను. అతడు మంగపతి కంటే పెద్ద పాత్రలు పోషిస్తాడని ఆశిస్తున్నాను. హర్ష్ -శ్రీదేవి నా బాధ్యత, నేను వారిద్దరినీ చూసి చాలా గర్వపడుతున్నాను'' అన్నారు.
'బలగం' భారీ హిట్ అయ్యాక అనిశ్చితి నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని ప్రియదర్శి అన్నారు. నా జీవిత ఉద్దేశ్యాన్ని కూడా నేను ప్రశ్నించాను. కానీ దర్శకుడు కోర్ట్ కథతో నన్ను సంప్రదించినప్పుడు అది నాకు కనెక్ట్ అయి ఉందనిపించింది. అందుకే నటించాను.. అని అన్నారు. నాని మద్దతు లేకుండా కోర్టు లేదు. నానిలో నేను చూసిన గుణం నమ్మితే ప్రాణమిస్తాడు. ఇది నిజంగా గొప్ప లక్షణం. ఎందుకంటే మొత్తం సినిమాను కేవలం ఆరు నెలల్లో చిత్రీకరించి విడుదల చేశారు! అని దర్శి అన్నారు.