విశ్వక్ కల్ట్ గోల.. SKN బాధేమిటంటే..
రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు
విశ్వక్ సేన్ ప్రొడ్యూసర్ గా కల్ట్ టైటిల్ తో ఒక సినిమాని తాజాగా ఎనౌన్స్ చేశారు. అందరూ కొత్తవాళ్లతో సే నో డ్రగ్స్ క్యాప్షన్ పెట్టి హ్యాష్ ట్యాగ్ కల్ట్ అని టైటిల్ తో పోస్టర్ డిజైన్ చేసి తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో విశ్వక్ సేన్ ఈ సినిమాకి సంబందించిన విశేషాలని పంచుకున్నారు. తాను రాసిన కథతో తన సొంత ప్రొడక్షన్ లో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పటికే కల్ట్ బొమ్మ టైటిల్ ని ఎస్కేఎన్ రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పుడు అందులో సగం తీసేసి కల్ట్ బొమ్మ ఎందుకు పెట్టారు అని మీడియా అడిగిన ప్రశ్నకి నేను రిజిస్టర్ చేసే సమయానికి కల్ట్ బొమ్మ, కల్ట్ అనే టైటిల్స్ రిజిస్టర్ అయ్యి లేవు. అందుకే ఈ టైటిల్ తన స్టొరీకి యాప్ట్ అవుతుందని పెట్టుకున్నా అని తెలిపారు.
అయితే దీనిపై నిర్మాత ఎస్కేఎన్ రియాక్ట్ అయ్యారు. తాను ఇప్పటికే కల్ట్ బొమ్మ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నానని తెలిపారు. బేబీ సినిమా సమయంలో కల్ట్ బొమ్మ అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. దీంతో తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కల్ట్ బొమ్మ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్న. రిజిస్టర్ అయిన తర్వాతనే టైటిల్ ని కూడా రివీల్ చేయడం జరిగిందని ట్విట్టర్ ఎక్స్ లో కన్ఫర్మ్ చేశారు.
అయితే కల్ట్, కల్ట్ బొమ్మ రెండు భిన్నమైన పేర్లు కాబట్టి ఇందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని కొందరు అంటూ ఉంటే కచ్చితంగా వివాదం అవుతుందని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. కల్ట్ అనే పధం గత కొంత కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో భాగా వినిపిస్తోంది. సౌండ్ బాగుండటంతో ఈ పదాన్ని టైటిల్ గా విశ్వక్ సేన్ పెట్టుకున్నారు. అయితే బేబీ సినిమా విషయంలో విశ్వక్, దర్శకుడు సాయి రాజేష్ మధ్య కొంత కాంట్రవర్సీ నడిచింది.
ఈ నేపథ్యంలో ఎస్కేఎన్ తో విశ్వక్ కి కల్ట్ టైటిల్ విషయంలో గొడవ జరిగే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అయితే భిన్నమైన పేర్లు అని సైలెంట్ గా ఉంటారా లేదంటే కల్ట్ సౌండ్ కోసం ఇద్దరు ఫైట్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.