వ్యవసాయ కుటుంబం నుంచి సినిమా వ్యాపారం!
డా..మూవీ మోఘల్ రామానాయుడు కారంచేడు నుంచి చెన్నై వెళ్లి సినిమా రంగంలో అంచలంచెలుగా ఎదిగిన వైనం తెలిసిందే
డా..మూవీ మోఘల్ రామానాయుడు కారంచేడు నుంచి చెన్నై వెళ్లి సినిమా రంగంలో అంచలంచెలుగా ఎదిగిన వైనం తెలిసిందే. భారతదేశ సినీ చరిత్రలోనే నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేసారు. భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా చరిత్ర సృష్టించారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామానాయుడు సినిమా నిర్మాణంలో ఓ సామ్రాజ్యాన్నే స్థాపించారు.
ఆయన స్పూర్తితో ఎంతో మంది నిర్మాతలు పరిచమయ్యారు. ఆయన నిర్మాణ సంస్థలోనే ఎంతో మంది హీరోలు.. దర్శకులు...నటీనటులు తయారయ్యారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఇక ఆయన యాక్టివ్ గా ఉన్న రోజుల్లోనే రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తండ్రి బాటలోనే తనయుడు ప్రయాణం మొదలు పెట్టి రామానాయుడు స్థాపించిన నిర్మాణ సామ్రాజ్యాన్ని ఎంతో ద్విగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు.
చిన్న కుమారుడు వెంకటేష్ హీరో అయితే? సురేష్ బాబు నిర్మాణ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. తాజాగా వెంకటేష్ 75 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా సురేష్ బాబు తమ ప్రయాణాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'ఇన్ని సినిమాలకు కారణమైన ప్రతీఒక్కరికీ ధన్యవాదములు. వ్యవసాయ కుటుంబం నుంచి మేము ఈ వ్యాపారంలో ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది.
నాన్న గారి దారిలోనే నేను నడిచి నిర్మాణంలో ఉన్నాను' అని అన్నారు. 'తెరపైనా..తెర వెనుకా ఆయన జీవితం. మా అందిరికీ స్పూర్తి. ప్రతీ నటుడి కుటుంబం వెంకటేష్ లా ఉండాలని కోరుకుంటుంది. అందరి అభిమానులు ప్రేమించే హీరో వెంకటేష్' అని నేచురల్ స్టార్ నాని అన్నారు. 'ఇంట్లో మా అందరికీ గురువు చిన్నాన. విజయం వచ్చినా..పరాజయం వచ్చినా ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఆయన వల్లే నేను ఇలా ఉన్నాను' అని రానా అన్నాడు.