ఇంతకాలం అతడ్ని స్టార్ డమ్ కాపాడిందా?
ఈ నేపథ్యంలో దర్శన్ మానసిక పరిస్థితి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
రేణుకాస్వామి హత్య కేసులో అభియోగం ఎదుర్కోంటున్న కన్నడ నటుడు దర్శన్ పై ప్రధానంగా కోపం అనేది ఆయన బలహీనతగా హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే. కోపాన్ని అస్సలు నియంత్రిచుకోలేడని స్వయంగా ఆయనతో పనిచేసిన హీరోయిన్లే చెబుతున్నారు. కోపం కట్టలు తెచ్చుకుంటే విచక్షణ రహితంగా విశ్వరూపం చూపిస్తాడని కోస్టార్స్ ఎంతో మంది అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో దర్శన్ మానసిక పరిస్థితి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమ్యలున్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు చెబుతున్నారు. గతంలో దర్శన్ గొడవపడిన తీరును, సెట్స్ లో అతడి దూకుడు ప్రవర్తన, ఉదంతలను ఈ సందర్భంగా మళ్లీ గుర్తు చేస్తున్నారు. గతంలో దర్శన్ కి కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు.
చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందించడం, కోపం రావడం, ఆసమయంలో ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తించడం వంటివి ఉండేవన్నారు. అయితే ఇది ఇది అతడు గమనించకపోవడం అతని పొరపాటుగా చెప్పారు. అతడి స్టార్ డమ్ కారణంగా తనలో లోపాల్ని గుర్తించకుండా ఇష్టానుసారం వ్యవరిం చడం ఇంతవరకూ జరిగిన తప్పిదాలు చిన్నవి కావడం..ఇప్పుడు హత్యకు ప్రేరిపితమైంతగా అతడి మానసిక స్థితి మారిందని అన్నారు.
అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే ఇంతవరకూ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడతను ఉన్న పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అవసరమని అన్నారు. అయితే ఈ అంశాలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బెయిల్ కోసం కొత్త విషయాలు తెరపైకి తెస్తున్నారని నెటి జనులు మండిపడుతున్నారు. మానసిక స్థితి బాగోలేదని డాక్టర్లు నిర్ధారిస్తే అతడికి బెయిల్ వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు.