ఆ మూడు బడా సినిమాలు.. 2500 కోట్ల బిజినెస్!

ఈ ఏడాది డిసెంబర్ నెలలో బాలీవుడ్ నుంచి ఏకంగా మూడు బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో డిసెంబర్ 1న రెండు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.

Update: 2023-11-22 09:24 GMT

కరోనా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా డౌన్ అయిపోయింది. లాక్ డౌన్ టైం లో కరోనా కష్టాలు, నెపోటిజం, బాయ్ కాట్ ట్రెండ్, సుశాంత్ సింగ్ రాజ్ సూసైడ్.. వీటన్నిటికీ తోడు సౌత్ సినిమాలు హిందీ పరిశ్రమను కోలుకోకుండా చేశాయి. ఇక బాలీవుడ్ పనైపోయిందని అందరూ అనుకున్న సమయంలో ఈ ఏడాది షారుక్ ఖాన్ హిందీ సినిమా పరిశ్రమను ఆదుకున్నాడు. 2023 హిందీ చిత్ర పరిశ్రమ కి కొత్త ఉత్సాహాన్ని నింపింది

ఈ ఏడాది షారుక్ పఠాన్, జవాన్ లతో బ్యాక్ టు బ్యాక్ రూ.1000 కోట్లు రాబట్టడం, అనంతరం 'గదర్ 2' రూ.550 కోట్లు కలెక్ట్ చేయడం, దివాళికి రిలీజ్ అయిన టైగర్ 3 మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉండడం, పలువురు యంగ్ హీరోలు నటించిన సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ అందుకోవడంతో బాలీవుడ్ పూర్తిగా కోలుకుంది. ఆరంతోనే అదరగొట్టిన బాలీవుడ్ ఇప్పుడు ఎండింగ్ లోనూ అంతకుమించి బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసేందుకు రెడీ అయింది

ఈ ఏడాది డిసెంబర్ నెలలో బాలీవుడ్ నుంచి ఏకంగా మూడు బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో డిసెంబర్ 1న రెండు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో విక్కీ కౌశల్ నటించిన 'సామ్ బహదూర్' ఒకటి. ఇప్పటికే ఈ మూవీపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. టాక్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద రూ.200 నుంచి రూ.300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో సినిమా 'యానిమల్' సైతం అదే రోజు రిలీజ్ అవుతుంది

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. సందీప్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ కబీర్ సింగ్ కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చూస్తే యానిమల్ కచ్చితంగా రణబీర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా ఉంది. ఇక రణబీర్ తర్వాత 'డంకీ' తో హ్యాట్రి కిట్ కొట్టేందుకు మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు షారుక్. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 21న రిలీజ్ కాబోతోంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1500 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అలా సామ్ బహదూర్, యానిమల్, డంకీ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు ప్రభాస్ నటించిన 'సలార్' కూడా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ప్రభాస్ కి నార్త్ లో ఉన్న మార్కెట్ ని బట్టి సలార్ హిందీ వర్షన్ కేవలం నార్త్ లోని రూ.500 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అంటే ఒక్క నెలలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.2500 నుంచి రూ.3000 కోట్ల కలెక్షన్స్ రాబోతున్నాయన్నమాట.

Tags:    

Similar News