కత్రినా..దీపిక ఒకే ఏడాది మామ్!
దీపికా పదుకొణే-కత్రినా కైఫ్ ఈ ఏడాది తల్లిగా ప్రమోషన్ అందుకోబోతున్న సంగతి తెలిసిందే.
దీపికా పదుకొణే-కత్రినా కైఫ్ ఈ ఏడాది తల్లిగా ప్రమోషన్ అందుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు గర్భవతులుగా ఉన్నారు. ఇప్పటికే కత్రినా ప్రసవం కోసం లండన్ లో ఉందని ప్రచారం జరుగుతోంది. భర్త విక్కీ కౌశల్ తో కలిసి క్యాట్ లండన్ లో ఉందని...వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇంతవరకూ కత్రినా గర్భందాల్చిన విషయాన్నే అధికారికంగా చెప్పలేదు.
దీంతో ఈ విషయాన్ని పూర్తిగా మీడియాకి దూరంగా ఉంచాలనే ఉద్దేశం కనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో కొంత మంది గోప్యత వహించడం సాధారణంగా జరిగేదే. అలాగే దీపికా పదుకొణే-రణవీర్ సింగ్ జోడీ అయితే ఎంతో సంతోషంగా తల్లిదండ్రులు అవుతోన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీపిక బేబి బంప్ ఫోటోలు కూడా నెట్టింట చక్కెర్లు కొట్టాయి. అవసరం మేర ఫోటో షూట్లలో సైతం పాల్గొంటుంది.
ఇలా దీపిక విషయంలో అంతా ఓపెన్ గానే ఉంది. అయితే ఈ స్టార్ భామలిద్దరు ఒకే ఏడాది మామ్ లుగా మారడం ఇంట్రెస్టింగ్. ఒకే పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ల విషయంలో ఇలా జరగడం అన్నది చాలా రేర్. ఆ రకంగా ఇద్దర్నీ సంథింగ్ స్పెషల్ గా భావించొచ్చు. మరి ఈ స్టార్ హీరోయిన్లు ఇద్దరికీ అబ్బాయి పుడతాడా? అమ్మాయి పుడుతుందా? అన్నది చూడాలి. ఒకే ఏడాది శుభ వార్త చెప్పిన హీరోయిన్లు కూడా ఒకే రోజు ప్రసవం జరిగితే ఇంకా స్పెషల్. మరి అందుకు ఛాన్సెస్ ఉన్నాయా? అన్నది దైవ నిర్ణయం.
కత్రినా గర్భం దాల్చిన నాటి నుంచి ఇంటికే పరిమితమైంది. ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. కానీ దీపిక మాత్రం గర్భంతోనూ అవసరం మేరు షూటింగ్ లను పూర్తి చేసింది. ప్రస్తుతం మాత్రం దీపిక కూడా విశ్రాంతిలోనే ఉంది. దీపిక నటించిన కల్కి 2898 జూన్ లో రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా ప్రచారంలో ఆమె పాల్గొనే అవకాశం లేదు. తన సందేశాన్ని వీడియో రూపంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.