ట్రోలింగ్‌కి అలా చెక్ పెట్టిన స్టార్ హీరోయిన్

ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ తో దీపిక మాట్లాడుతూ.. ట్రోలింగ్ నిఎదుర్కోవడానికి తనకు ఎమోషనల్ బ్యాండ్‌విడ్త్ లేదని ఒప్పుకుంది.

Update: 2023-09-15 03:00 GMT

పొడుగు కాళ్ల సుంద‌రి దీపికా పదుకొణె సోషల్‌మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా విరుచుకుపడింది. ఇండస్ట్రీలోని చాలా మంది తారల మాదిరిగానే దీపిక కూడా సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురవుతుందనేది రహస్యం కాదు. త‌న వేష‌ధార‌ణ‌ను విమ‌ర్శించేవారు..ప్ర‌క‌ట‌న‌ల్లో రూపాన్ని అనేవాళ్లు చాలామంది ఉన్నారు. రెడిట్ .. ట్విట్ట‌ర్ (ఎక్స్) వంటి వేదిక‌ల‌పై దీపిక‌పై ఇలాంటి డిబేట్లు త‌ర‌చుగా జ‌రుగుతుంటాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో దీపిక త‌న‌ను ట్రోల్ చేసేవారి గురించి మాట్లాడింది.

ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ తో దీపిక మాట్లాడుతూ.. ట్రోలింగ్ నిఎదుర్కోవడానికి తనకు ఎమోషనల్ బ్యాండ్‌విడ్త్ లేదని ఒప్పుకుంది. సగం సమయం నేను ట్రోలింగుకి గుర‌వుతూనే ఉన్న సంగ‌తి నాకు తెలియదు.

ఇది నా భావోద్వేగ బ్యాండ్‌విడ్త్‌లో లేదు. నాకు లేజర్ ఫోకస్ ఉన్నందున నా పని ప్రభావితం కాదు. మెనియల్ లేదా ట్రివియల్‌పై దృష్టి పెట్టడానికి నాకు బ్యాండ్‌విడ్త్ లేదు! అంటూ వ్యంగ్యంగా స్పందించింది దీపిక‌.

త‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లున్నా కానీ, దీపిక ప్ర‌తిసారీ తన ఎయిర్‌పోర్ట్ లుక్స్ విష‌యంలో షో స్టాప‌ర్ గా నిలుస్తూనే ఉంది. దీనిపై దీపిక మాట్లాడుతూ- ''నా అంత‌ట నేను అందంగా కనిపించడం లేదు. నా కోసం నా రూపాన్ని తీర్చిదిద్దే ఒక ప్రొఫెషనల్ నాతో ఉన్నాడు. ర‌క‌ర‌కాల దుస్తుల‌ను ధ‌రించ‌డం నాకు వ్య‌క్తిగ‌తంగా ఇష్టం. నిజం చెప్పాలంటే, నేను నా కోసం నేను దుస్తులు ధరిస్తాను. నేను డిజైన‌ర్ లుక్స్‌ని ఇష్టపడతాను, నా స్టైలిస్ట్‌లకు నేను సమయాన్ని ఇస్తాను. కొత్తగా ప్రయత్నించడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను ప్రొఫెషనల్ మోడల్‌ని అని మర్చిపోవద్దు'' అంటూ దీపిక తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దీపికా పదుకొనే త‌దుప‌రి 'ఫైటర్‌'లో కనిపిస్తుంది. ఇందులో హృతిక్ రోషన్, అనిల్ కపూర్‌లతో క‌లిసి న‌టిస్తోంది. ప్రభాస్ తో కల్కి 2898 AD చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల కానున్నాయి.

Tags:    

Similar News