13 వ‌య‌సు నుంచే ఖాన్‌ల‌తో క‌నెక్ష‌న్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసిన దీపిక ఇలా రాసింది. ''1 జనవరి 2000.. త్రోబ్యాక్ జ్ఞాప‌కం. నాకు 13 ఏళ్లు .. ఇబ్బందికరమైనవి. నేను ఇప్పటికీ ఉన్నాను.

Update: 2024-07-15 14:01 GMT

కింగ్ ఖాన్ స‌ర‌స‌న యుక్త‌వ‌య‌సులో 'ఓం శాంతి ఓం' చిత్రంలో న‌టించింది దీపిక ప‌దుకొనే. ఇది త‌న‌కు నటిగా బాలీవుడ్ లో తొలి సినిమా. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ గాళ్‌గా వెలిగిపోయిన దీపిక అప్ప‌టికి కేవ‌లం మోడ‌ల్ మాత్ర‌మే. కానీ ఖాన్ స‌ర‌స‌న న‌టించాక నెమ్మ‌దిగా స్టార్ డ‌మ్ వైపు అడుగులు వేసింది. అయితే దీపిక‌కు 13 ఏళ్ల వ‌య‌సు నుంచే ఖాన్ ల‌తో క‌నెక్ష‌న్ ఉంద‌నేది చాలా త‌క్కువ మందికే తెలుసు. అంత‌కుముందే అమీర్ తో దీపిక కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది.

అప్ప‌టికి దీపిక వ‌య‌సు 13. త‌న క‌ళ్ల ముందే అమీర్ ఖాన్ పెరుగ‌న్నం తినేస్తుంటే ఆక‌లిగా చూసింద‌ట‌. అత‌డు త‌న‌కు పెరుగ‌న్నం ఆఫ‌ర్ చేయ‌నందుకు 13 ఏళ్ల దీపిక‌ చాలా తిట్టుకుంది కూడా. నాటి దృశ్యానికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్‌ను ఇప్పుడు దీపిక షేర్ చేసి అప్ప‌టి విష‌యాన్ని గుర్తు చేసుకుంది. 24 ఏళ్ల నాటి త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు వెబ్ లో వైర‌ల్ గా మారింది. దీపిక చ‌లోక్తి అంద‌రినీ న‌వ్వించేస్తోంది.

టీనేజీ వయసులో ఆకలితో అలమటిస్తున్నప్పటికీ తనకు పెరుగు అన్నం షేర్ చేయ‌నందుకు దీపిక అమీర్‌ను తిట్టిపోసిన విధానం అందరినీ నవ్వించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసిన దీపిక ఇలా రాసింది. ''1 జనవరి 2000.. త్రోబ్యాక్ జ్ఞాప‌కం. నాకు 13 ఏళ్లు .. ఇబ్బందికరమైనవి. నేను ఇప్పటికీ ఉన్నాను. అతడు భోజనం చేస్తున్నాడు. కచ్చితంగా చెప్పాలంటే పెరుగు అన్నం. నేను ఎప్పటిలాగే ఆకలితో ఉన్నాను. కానీ అతడు ఆఫర్ చేయలేదు.. నేను అడగలేదు'' అని రాసింది. దీపిక అమీర్ కి.. త‌న‌ తండ్రి ప్రకాష్ పదుకొనేకు మధ్య కూర్చుంది. నల్లని చొక్కా - ప్యాంటులో కనిపిస్తోంది. దీపిక‌ తల్లి ఉజ్జల ఎడమ వైపున తన చిన్న కుమార్తె అనిషాను తన ఒడిలో ఉంచుకుంది. అమీర్ తన 2001 చిత్రం దిల్ చాహ్తా హై నుండి ఐకానిక్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. మొత్తానికి ఈ ఫోటో చాలా మందిని క‌డుపుబ్బా న‌వ్వించింది.

ఈ ఫోటో గంటలోపే 5,50,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది. ఆమిర్ - దీపిక నాడు వ‌ర్సెస్ నేడు ప్రదర్శనల గురించి అభిమానులలో చర్చ సాగుతోంది. ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు. ''మీకు 13 సంవత్సరాలు.. జీస‌స్‌.. మీరు చాలా పొడవుగా ఉన్నారు!'' అని రాయ‌గా.. మరొకరు వాహ్.. నేను అతడి దిల్ చాహ్తా హై గోటీని చూడగలను అని రాసాడు. దీపిక చాలా కాలంగా ఖాన్ ల‌కు చుట్ట‌మే అంటూ ఒక‌రు వ్యాఖ్యానించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం జెనీలియా డిసౌజాతో కలిసి తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ చిత్రీకరణను ప్రారంభించాడు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD విజ‌యాన్ని దీపిక ఆస్వాధిస్తోంది. ఈ పాన్ ఇండియా విజ‌యంతో దీపిక ద‌క్షిణాదిన ఘ‌నమైన‌ విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటోంది. దీపిక న‌టించిన 'సింగం ఎగైన్' దీపావళికి విడుదల కానుంది.

Tags:    

Similar News