దేవర టిక్కెట్ల మోసం.. న్యాయమేనా?
ఈ అర్ధరాత్రి షోలు పర్టిక్యులర్ గా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మాత్రమే వేయనున్నారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం ఈ బెన్ ఫిట్ షోలు ఏర్పాటు చేశారు
తెలుగు రాష్ట్రాలలో ‘దేవర’ మూవీ బెన్ ఫిట్ షోలకి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి 1 గంటకి అలాగే ఉదయం 4 గంటలకి షోలు వేసుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. అయితే టికెట్ ధరల విషయంలో మాత్రం డిస్టిబ్యూటర్స్ అడిగినంత ఇవ్వలేదు. ఈ అర్ధరాత్రి షోలు పర్టిక్యులర్ గా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మాత్రమే వేయనున్నారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం ఈ బెన్ ఫిట్ షోలు ఏర్పాటు చేశారు.
అయితే ఈ బెన్ ఫిట్ షోల టికెట్ ధరలు బ్లాక్ మార్కెట్ లో షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు మేరకు అయితే వీటికి కూడా ఆన్ లైన్, బుకింగ్ కౌంటర్లలోనే విక్రయించాలి. కానీ కొద్ది సేపు ఆన్ లైన్ లో పెట్టిన తర్వాత టికెట్స్ అన్ని బ్లాక్ లో అమ్ముతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ షోలకి ఆన్ లైన్ బుకింగ్స్ ఎక్కడా కనిపించడం లేదు.
‘దేవర’ మిడ్ నైట్ షోలకి టికెట్ లని బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఫ్యాన్స్ కి నేరుగా 2000, 2500 ధరలకి అమ్ముతున్నారనే మాట సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది. మిడ్ నైట్ షో చూడాలని అనుకునే ఫ్యాన్స్ టికెట్ ధర ఎంతైనా కొనడానికి వెనుకాడరు. ఫ్యాన్స్ కూడా భారీ ధర పెట్టి టికెట్ కొన్నాము అని సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం కూడా చేసుకుంటారు.
ఫ్యాన్స్ ఇంటరెస్ట్ ని ‘దేవర’ బెన్ ఫిట్ షోల ద్వారా గట్టిగా క్యాష్ చేసుకుంటున్నారనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. అయితే టికెట్లన్నీ భారీ ధరకి బ్లాక్ మార్కెట్ లో అమ్మడం ద్వారా ప్రభుత్వానికి కలిసొచ్చేది ఏమీ ఉండదు. ఒరిజినల్ టికెట్ ధరల ప్రకారమే టాక్స్ చెల్లిస్తారు. బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు సినిమా కలెక్షన్స్ లో కూడా కలిసే అవకాశం ఉండదు.
బ్లాక్ మార్కెట్ టికెట్ల విక్రయాన్ని కట్టడి చేయకపోతే.. భవిష్యత్తులో మిగిలిన స్టార్ హీరోల సినిమాలకి కూడా కొందరు ఇదే పద్ధతి ఫాలో అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకి బ్లాక్ టికెట్ దందా ఎక్కువ నడిచేది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇది చాలా వరకు తగ్గింది అయితే స్పెషల్ గా మిడ్ నైట్ బెన్ ఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడంతో మరల బ్లాక్ టికెట్ దందా పెరిగే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఈ విషయంపై సీరియస్ గా ఏదైనా సొల్యూషన్ తీసుకొస్తారా లేదో చూడాలి.