దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ లొల్లి మొత్తం అక్కడే షురూ!

అగ్రహీరో సినిమా ఫంక్షన్ నిర్వహించే వేళలో.. ఆ హీరో అభిమానుల్ని కంట్రోల్ చేయటం అంత తేలికైన విషయం కాదు.

Update: 2024-09-23 03:45 GMT

అగ్రహీరో సినిమా ఫంక్షన్ నిర్వహించే వేళలో.. ఆ హీరో అభిమానుల్ని కంట్రోల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోకుంటే మొదటికే మోసం వస్తుంది. తాజాగా దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ వ్యవహారం కూడా ఇలానే తయారైంది. పరిమితంగా మాత్రమే పాసులు జారీ చేయటం వరకు జాగ్రత్తగానే ఉన్నా.. ఈవెంట్ ను నిర్వహించే ప్రాంగణం వద్దకు అనుమతించే వారి విషయంలో మొదటి తప్పు దొర్లితే.. ఈవెంట్ లోపలకు వెళ్లిన అభిమానుల్నికంట్రోల్ చేయాల్సిన విషయంలో జరిగిన పొరపాట్లు మరింత రచ్చకు కారణమైంది.

సాధారణంగా దేవర లాంటి మూవీ వేడుకల్ని ఓపెన్ ప్లేస్ లలోకానీ.. స్టేడియంలో కానీ నిర్వహించాలి. అందుకు భిన్నంగా నొవాటెల్ లాంటి హోటల్ లోఅందునా లిమిటెడ్ మెంబర్స్ కు మాత్రమే అవకాశం ఉన్న చోట.. లోపలకు వచ్చే ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరో ఇబ్బందికరమైన అంశం ఏమంటే.. లోపలకు వచ్చిన తర్వాత సాధారణప్రేక్షకులకు.. సెలబ్రిటీలకు.. వీఐపీలకు మధ్య దూరం తక్కువగా ఉండటం.. ఈజీగా వారిని యాక్సిస్ చేసేందుకు అవకాశం ఉండటం ప్రధాన లోపంగా చెప్పాలి.

తమ అభిమాన తారల్ని చూసేందుకు వచ్చే అభిమానుల మొత్తం ఫోకస్ ఇప్పుడు సెలబ్రిటీల మీదనే. అందునా. . సోషల్ మీడియా రచ్చ ఎక్కువై.. వాట్సాప్ విశేషంగా వ్యవహరిస్తున్న వేళ.. కంటికి కనిపించిన ప్రతి సెలబ్రిటీలను తమ కెమేరాల్లో బంధించాలని.. వారితో కలిసి సెల్ఫీలు దిగాలని.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారింది. దీనికి తోడు.. సెలబ్రిటీలు.. వీఐపీలు పెద్ద ఎత్తున వస్తున్నారన్నసమాచారం ఉన్నప్పుడు.. ఈ వేడుకకు వచ్చే ప్రతి అభిమానికి బోలెడన్ని ఆశలు ఉంటాయి. వాటికి అవకాశం లేకుండా చేయటం ఒక ఎత్తు. క్రమశిక్షణతో వారిని నియంత్రించటం బాగుంటుంది. అందుకు భిన్నంగా వేడుక జరిగే ప్రాంతంలో సరైన ఏర్పాట్లు చేయకపోవటం.. లోపలకువచ్చినోళ్లంతా వీఐపీ.. సెలబ్రిటీ బాక్సుల్లోకి దూసుకురావటంతో ఇష్యూ మొత్తం రచ్చ రచ్చగా మారింది. మొత్తంగా చూస్తే.. దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ ఫ్లాప్ షోకు బాధ్యులు ఈవెంట్ ను నిర్వాహకులే తప్పించి ఇంకెవరూ కాదని చెప్పక తప్పదు.

Tags:    

Similar News