'దేవ‌ర' శాంపిల్ మాత్ర‌మే..ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!

థియేట్రిక‌ల్ రిలీజ్ అనంత‌రం కొత్త సినిమా ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది.

Update: 2025-02-18 11:35 GMT

థియేట్రిక‌ల్ రిలీజ్ అనంత‌రం కొత్త సినిమా ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది. అలాంటప్పుడు అదే సినిమాని మ‌ళ్లీ ప్రేక్ష‌కులు టీవీలో ఎందుకు చూస్తారు? అందుకే శాటిలైట్స్ రైట్స్ భారీగా ప‌డిపోయాయి అన్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఒక‌ప్ప‌టి ప‌రిస్థితికి పూర్తి భిన్నంగా శాటిలైట్ సినిమా క‌నిపిస్తుంది. దీంతో ఓటీటీ వ‌చ్చింద‌ని ఆనంద ప‌డాలో? శాటిలైట్ డిమాండ్ త‌గ్గింద‌ని సంతోష ప‌డాలో? అర్దం కాని ప‌రిస్థితి నిర్మాత‌కు ఎదుర‌వుతుంది.

ఓటీటీలో డీల్ కుదిరి శాటిలైట్ డిమాండ్ ప‌డిపోతుంది. తక్కువ ధ‌ర‌కు విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అందులోనూ సినిమాకి నెగిటివ్ టాక్ వ‌చ్చిందంటే? ఆ సినిమా శాటిలైట్ ప‌రిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్ర‌స్తుతం `దేవ‌ర` సినిమా ప‌రిస్థితి అలాగే ఉంది. ఈ సినిమా రిలీజ్ అయి ఐదు నెల‌లు గ‌డిచిపోయింది. ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయింది.

కానీ ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఇంకా జ‌ర‌గ‌లేదు. కొన్ని ఛానెల్స్ ముందుకొచ్చి ఆఫ‌ర్ ఇచ్చిన‌ప్ప‌టికీ గిట్టుబాటు ధ‌ర కాపోవ‌డంతో నిర్మాత విక్ర‌యించ‌లేద‌ని స‌మాచారం. నిర్మాత కోట్ కి...శాటిలైట్ ఛానెల్స్ కోట్ మ‌ధ్య భారీ వ్య‌త్యాసం ఉండ‌టంతోనే ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. అలాగ‌ని శాటిలైట్ ఛాన్స్ తీసుకుని భారీగా కోట్ చేయ‌లేదు. ఎందుకంటే ఇప్పుడా సినిమా టీవీలో ప్రీమియ‌ర్ అయినా చూసే ప‌రిస్థితి లేదు.

ఈ నేప‌థ్యంలో శాటిలైట్ ఛానెల్స్ ముందుకు రావ‌డం లేదు. ఇంత‌కు ముందు `క‌ల్కి 2898` కూడా స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే ఎదుర్కుంది. ఈ సినిమా కూడా చాలా ఆల‌స్యంగానే శాటిలైట్ లోకి వ‌చ్చింది. అయితే ఈ రెండు సినిమాల‌కు ఓ మైన‌స్ కూడా ఉంది. `దేవ‌ర` రిలీజ్ అనంత‌రం చాలా నెగిటివ్ టాక్ వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో వాస్త‌వం ఎంతో తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో కూడా శాటిలైట్ జ‌ర‌గ‌లేదు అన్న వాద‌న తెర‌పైకి వ‌స్తుంది.

`క‌ల్కి 2898` కూడా తెలుగు ఆడియ‌న్స్ కి థియేట్రిక‌ల్ గానూ అంత‌గా క‌నెక్ట్ కాలేదు. హాలీవుడ్ స్టైల్లో ఉండ‌టం ఆ సినిమాకి నెగిటివ్ గా మారింది. అలాంట‌ప్పుడు శాటిలైట్ లో రిలీజ్ అయితే వ‌చ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో? తెలియ‌ని సందిగ్దంలోనే శాటిలైట్ బిజినెస్ క‌ష్టంగా జ‌రిగింది అన్న అంశం అప్ప‌ట్లో తెర‌పైకి వ‌చ్చింది. ఏది ఏమైనా? భ‌విష్య‌త్ లో శాటిలైట్ ఛాన‌ల్స్ సినిమాల స్ట్రీమింగ్ విష‌యంలో కొత్త విధానాలు అమ‌లులోకి తీసుకు రావాలి? అది ఓటీటీ రిలీజ్ కి పోటీగా ఉండాలి. అప్పుడే శాటిలైట్ ప‌రంగా వ‌ర్కౌట్ అవుతుంది అన్న‌ది బిజినెస్ నిపుణుల మాట‌.

Tags:    

Similar News