డీఎస్పీ అంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాడా?

నిన్న‌టి రోజున హైద‌రాబాద్ లో జ‌రిగ‌తిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ క‌న్స‌ర్ట్ గ్రాండ్ స‌క్సెస్ అయింది.

Update: 2024-10-21 02:50 GMT

నిన్న‌టి రోజున హైద‌రాబాద్ లో జ‌రిగ‌తిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ క‌న్స‌ర్ట్ గ్రాండ్ స‌క్సెస్ అయింది. వేలాది మంది రాక్ స్టార్ క‌న్స‌ర్ట్ కి హాజ‌రై షోని స‌క్సెస్ చేసారు. ఇక దేశ వ్యాప్తంగా అత‌డు షోలు ఎంచ‌క్కా చేసుకోవ‌చ్చు. హైద‌రాబాద్ లో మొద‌లు పెట్టిన కన్స‌ర్ట్ ఎక్క‌డా ముగిస్తాడు? అన్న‌ది చూడాలి. అయితే ఈ లైవ్ క‌న్స‌ర్ట్ లో ఎక్కువ‌గా మెగా ఫ్యామిలీ హీరోల పాట‌లే హైలైట్ చేసాడు. వాటితోనే యువ‌తలో ఊపు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసాడు.

అందులో 80 శాతం స‌క్సెస్ అయ్యాడు? మార్కెట్ లో మెగా హీరోల‌కు ఉన్న క్రేజ్ ని ఆ ర‌కంగా తెలివిగా ఎన్ క్యాష్ చేసుకున్నాడు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే తాను ఊహించ‌న‌ది ఒక‌టి జ‌రిగింది. ఈ వేడుక‌లో దేవి పాడిన పాట‌ల్లో ఒక‌టి కూడా సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన పాట‌ల‌కు సంబంధించి లేక‌పోవ‌డం. దీంతో మ‌హేష్ అభిమానులు బాగా హార్ట్ అయ్యారు ప్ర‌తిగా సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ బారిన ప‌డ్డాడు.

`నేనొక్క‌డినే` లో `హూఆర్ యూ` లాంటి సాంగ్ లైవ్ పెర్పార్మెన్స్ కి అద్భుతంగా ఉంటుంది? రాక్ స్టార్ ఆ పాట ఛాన్స్ తీసుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నారు. మ‌హేష్ న‌టించిన ఎన్నో సినిమాల‌కు స‌క్సెస్ పుల్ సాంగ్స్ ఎన్నో ఇచ్చాడు. అత‌డు అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం. దేవి అంటే మ‌హేష్ కి అంతే న‌మ్మ‌కం. కానీ అలా అభిమానించే హీరో పాట లేక‌పోవ‌డంతోనే సోష‌ల్ మీడియాలో ఇలా ట్రోల్స్ చూస్తే సంగ‌తి అర్ద‌మ‌వుతుంది. మ‌రి దీనికి రాక్ స్టార్ ఏదైనా వివ‌ర‌ణ ఇస్తాడా? అన్న‌ది చూడాలి.

ఎందుకంటే? ఏపీ-తెలంగాణ‌లో హీరోలంద‌ర్నీ చాలా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. గ‌తంలో రెహ‌మాన్, ఇళ‌య‌రాజా లాంటి లెజెండ్స్ లైవ్ ప్రోగ్రామ్ లు చేసి ఉండొచ్చు. కానీ వాళ్లతో పోలిస్తే...దేవి శ్రీ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ వేరు. ఇత‌డికి విప‌రీత‌మైన మాస్ ఫాలోయింగ్ ఉంది. త‌మ అభిమాన హీరో పాట ఎప్పుడు పాడుతాడా? అని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తుంటారు. ఆ లాజిక్ దేవి వి శ్రీ వ‌దిలేసి సింగిల్ ఎజెండాతో ముందుకు సాగ‌డం ఈ విమ‌ర్శ‌కు ఓ కార‌ణంగా అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News