డెవిల్ గొడవ.. దర్శకుడి స్ట్రాంగ్ కౌంటర్!
అయితే ఇందులో ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఉన్న అసలు దర్శకుడు నవీన్ మేడారం పేరు లేదు. ఆయన పేరుకు బదులుగా నిర్మాత అభిషేక్ నామా పేరు ఉంది.
నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెజ్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మేనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 24 థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్ర డైరెక్టర్ ఎవరన్నది.. ప్రేక్షకుల్లో గత కొద్ది రోజులుగా ఓ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్ర దర్శకనిర్మాత మధ్య విభేధాలు తలెత్తాయా అన్న అనుమానాలు కూడా నెలకొన్నాయి.
అయితే తాజాగా దర్శకుడు నవీన్ మేడారం చేసిన ఓ పోస్ట్.. ఈ విషయంపై మరింత ఉత్సుకత కలిగేలా, బలం చేకూరేలా చేసింది. దీంతో ఇప్పుడంతా మరోసారి డెవిల్ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే డెవిల్ నిర్మాణసంస్థ అభిషేక్ పిక్చర్స్.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేసింది.
అయితే ఇందులో ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఉన్న అసలు దర్శకుడు నవీన్ మేడారం పేరు లేదు. ఆయన పేరుకు బదులుగా నిర్మాత అభిషేక్ నామా పేరు ఉంది. ఇది ఓ వైపు క్యూరియాసిటీ పెంచడంతో పాటు ప్రేక్షకుల్లో సస్పెన్స్ ను కూడా క్రియేట్ చేసింది. దీంతో దర్శకుడికి నిర్మాతకు మధ్య విభేదాలు వచ్చాయా అని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నవీన్ మేడారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంస్కృతంలో ఓ పోస్ట్ చేశారు.
వినాశకాలే విపరీత బుద్ధి అని క్యాప్షన్ రాసుకొచ్చారు నవీన్ మేడారం. అయితే ఈ పోస్ట్ ను డెవిల్ మూవీటీమ్ తో సంబంధం ఉన్న ఎవరికీ ట్యాగ్ చేయలేదు. దీంతో నవీన్... నిర్మాత అభిషేక్ నామాను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ పెట్టారా అని అంతా ఆలోచిస్తున్నారు. మరి కొంతమంది అభిషేక్ నామాను ఉద్దేశించి పెట్టినదే అని అంటున్నారు. మరి ఇందతా ప్రమోషనల్ స్ట్రాటజీలో భాగంగా జరుగుతుందా? లేదా నిజంగానే ఏమైనా జరిగిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ వీడియో రిలీజై అభిమానులను ఆకట్టుకుంది. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా వస్తోంది. శ్రీకాంత్ విస్సా కథ అందించారు.