ధనుష్ క్రేజీ కాంబో.. రెండూ అతనే!
అయితే ధనుష్ డైరెక్షన్ లో రాయన్ సహా ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి.
కోలీవుడ్ యాక్టర్ ధనుష్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. అటు హీరోగా సినిమాలు చేస్తూ.. ఇటు డైరెక్టర్ గా మూవీస్ తీస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటిస్తూ.. దర్శకత్వం వహించిన రాయన్ మూవీతో మంచి ప్రశంసలు అందుకున్నారు. సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. ధనుష్ కు ప్రశంసించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తన డైరెక్షన్ మార్క్ ను అంతలా చూపించారు. అయితే ధనుష్ డైరెక్షన్ లో రాయన్ సహా ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి.
ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్, టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అదే సమయంలో కుబేర సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ధనుష్ తో పాటు సీనియర్ నటుడు నాగార్జున నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ధనుష్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
తాజాగా ధనుష్ కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. డాన్ పిక్చర్స్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్ తో ఆయన వర్క్ చేయనున్నారు. "కొత్త ఆరంభాలు! డాన్ పిక్చర్స్ బ్యాంగ్ తో ప్రారంభం! మా తొలి ప్రాజెక్టు ధనుష్ తో D52ను ప్రకటించినందుకు గర్వంగా ఉంది" అంటూ డాన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ ను ధనుష్ ను ఓం నమ శివాయ అంటూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ధనుష్ కొత్త మూవీ అనౌన్స్మెంట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి.
అయితే ధనుష్ కొత్త మూవీకి ఎవరు దర్శకత్వం వహించనున్నారనేది మేకర్స్ ప్రకటించలేదు. దీంతో ధనుష్ దర్శకత్వంలోనే ఆ సినిమా రూపొందే అవకాశం ఉందని కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక నవల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. నటుడు అరుణ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. హీరోకి ధీటుగా విలన్ పాత్రకు మంచి స్కోప్ ఉండడంతో అరుణ్ విజయ్ నటించడానికి అంగీకరించారని టాక్ వినిపిస్తోంది.
పాన్ ఇండియా లెవెల్ లో ధనుష్ కొత్త మూవీ ఉంటుందని వినికిడి. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ తో డాన్ పిక్చర్స్ నిర్మించనుందని సమాచారం. హీరోయిన్ గా నిత్యా మీనన్ ను సెలెక్ట్ చేసిన యోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే అన్ని వివరాలు నిర్మాత, డాన్ పిక్చర్స్ అధినేత ఆకాష్ భాస్కర్ వెల్లడించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి D52 మూవీని ఎవరు దర్శకత్వం వహిస్తారో? ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.