ధనుష్ బాక్సాఫీస్ లెక్క మామూలుగా లేదు
ఆయన స్వీయ దర్శకత్వంలోనే రాయన్ సినిమా తెరకెక్కింది.
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ కథల ఎంపికలో డిఫరెంట్ గా ఆలోచిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రియాలిటీకి దగ్గరగా ఉండే స్టోరీస్ తోనే ఎక్కువ సినిమాలు చేస్తాడు. మాస్ జోనర్ లో మూవీస్ చేసిన కూడా అతని సినిమాలు మన చుట్టూ జరిగిన సంఘటనల తరహాలోనే ఉంటాయి. మరీ బీభత్సమైన ఎలివేషన్స్ ఉండవు. క్యారెక్టర్ కి ఎంత అవసరమో అంత బిల్డ్ అప్ అయితే ఉంటుంది. అలాగే మరీ కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో కూడా అతని కథలు ఉండవు.
సింపుల్ ఎమోషన్స్ తోనే కథలలో కాన్ ఫ్లిక్ట్ లు కూడా ఉంటాయి. గత నెల రాయన్ సినిమాతో ధనుష్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన స్వీయ దర్శకత్వంలోనే రాయన్ సినిమా తెరకెక్కింది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఏకంగా 156 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాయన్ సొంతం చేసుకుంది. ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రాయన్ మూవీ నిలిచింది. ఇదిలా ఉంటే కరోనా తర్వాత 2021 నుంచి ఇప్పటి వరకు ధనుష్ 10 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
కోవిడ్ తర్వాత ధనుష్ నుంచి వచ్చిన మొదటి సినిమా కర్ణన్ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. 25 కోట్లతో నిర్మించిన ఈ మూవీ లాంగ్ రన్ లో 67 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 2021లో తమిళంలో హైయెస్ట్ గ్రాస్ చిత్రాలలో ఇది ఒకటి. తరువాత హాలీవుడ్ మూవీ ది గ్రే మెన్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పెద్దగా మెప్పించలేదు. తిరుచిత్రంబలం సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సింపుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కి ఏకంగా 117 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
దీని తరువాత సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన నాన్ వరువేన్ మూవీ డిజాస్టర్ అయ్యింది. నెక్స్ట్ తెలుగులో తెరకెక్కిన సార్ మూవీ ఏకంగా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళ్ భాషలలో కూడా మూవీ సూపర్ సక్సెస్ ని అందుకుంది. గత ఏడాది ఆఖరులో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ మూవీ ఓవర్ బడ్జెట్ కారణంగా కమర్షియల్ సక్సెస్ కాలేదు. అయితే లాంగ్ రన్ లో ఈ మూవీ 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఈ ఏడాది రాయన్ తో కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని ధనుష్ అందుకున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నెక్స్ట్ ధనుష్ నుంచి పాన్ ఇండియా మూవీగా కుభేర వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో 200 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాలని ధనుష్ భావిస్తున్నారు. మరి అదెంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.