రామ్ చ‌ర‌ణ్ ఆట‌పై ఏంటీ క‌న్య్పూజ‌న్!

బూత్ బంగ్లాలో డిసెంబర్ 10 నుంచి ఈ చిన్న షెడ్యూల్ స్టార్ట్ అవుతుందిట‌.

Update: 2024-12-08 06:08 GMT

ఆర్సీ 16 షూటింగ్ ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మైసూర్ లో ప‌ది రోజుల షెడ్యూల్ కూడా పూర్త‌యింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌-జాన్వీ క‌పూర్ ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. తాజాగా త‌దుప‌రి మ‌రో చిన్న షెడ్యూల్ హైద‌రాబాద్ బూత్ బంగ్లాలో ప్లాన్ చేస్తున్నట్లు స‌మాచారం. వచ్చే వారం నుంచి ఈ షూట్ ఉంటుంద‌ని తెలిసింది. ఇందులోనూ రామ్ చ‌ర‌ణ్ పాల్గొండాటు. ఇదే స‌మ‌యంలో క్రికెట్ గ్రౌండ్ లాంటి సెట్ కూడా రెడీ చేస్తున్నారుట‌.

ఇప్ప‌టికే ఈ సినిమా స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని చాలా కాలంగా ప్ర‌చారంలో ఉంది. క‌బ‌డ్డీ, కుస్తీ ఆట నేప‌థ్య‌మ‌ని ప్ర‌చారంలో ఉంది. తాజాగా క్రికెట్ స్టేడియం సెట్ అన‌డంతో? క్రికెట్ బ్యాక్ డ్రాపా? అన్న సందేహం వ్య‌క్త‌మ వుతుంది. అయితే ఆ స్టేడియం కేవ‌లం ఒక సీన్ కోసం మాత్ర‌మేన‌ని..క్రికెట్ నేప‌థ్యం కాద‌ని వినిపిస్తుంది. మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. బూత్ బంగ్లాలో డిసెంబర్ 10 నుంచి ఈ చిన్న షెడ్యూల్ స్టార్ట్ అవుతుందిట‌.

అటుపై క్రికెట్ స్టేడియం సీన్ తీస్తార‌ని స‌మాచారం. బూత్ బంగ్లా షెడ్యూల్ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' ప్ర‌చారం ప‌నుల్లో పాల్గొంటాడ‌ని తెలిసింది. 'గేమ్ ఛేంజ‌ర్' జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేస్తున్నారు. ఈలోగా చ‌ర‌ణ్ ఆ సినిమా డ‌బ్బింగ్ పనులు కూడా పూర్తిచేయాలి. అలాగే రిలీజ్ వ‌ర‌కూ ప్ర‌చారంలోనూ పాల్గొనాలి. అయితే ఈ సినిమా ప్ర‌చారం ఎక్క‌డెక్క‌డ నిర్వహిస్తారు? అన్న‌ది తెలియాలి. 'గేమ్ ఛేంజ‌ర్' రిలీజ్ అనంత‌రం చ‌ర‌ణ్ పూర్తి స్థాయిలో ఆర్సీ 16కి డేట్లు కేటాయిస్తాడ‌ని అప్ప‌టి నుంచి బుచ్చిబాబు లాంగ్ షెడ్యూల్స్ వేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఆర్సీ 16 కూడా వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌న్న‌ది బుచ్చిబాబు ప్లాన్. ఇప్పటికే రెహమాన్ నుంచి నాలుగు పాటల్ని తీసుకున్నాడని సమాచారం. రెహమాన్ మరో వైపు మ్యూజిక్, ఆర్ఆర్ పనుల్ని కూడా మొదలు పెట్టార‌ని తెలిసింది. ఈ చిత్రం తరువాత మళ్లీ సుకుమార్‌తో రామ్ చరణ్ చిత్రం ప‌ట్టాలెక్కుతుంది.

Tags:    

Similar News