ఆ హీరోయిన్ కి డైరెక్ట‌ర్ గా నేను వ్య‌తిరేకం కాదు!

`జిగ్రా`లో అలియాభ‌ట్ ఎంపిక వెనుక నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కీల‌క పాత్ర పోషించాడ‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూ లో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వాస‌న్ బాలా అన్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-10-05 06:30 GMT

`జిగ్రా`లో అలియాభ‌ట్ ఎంపిక వెనుక నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కీల‌క పాత్ర పోషించాడ‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూ లో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వాస‌న్ బాలా అన్న సంగ‌తి తెలిసిందే. తాను అనుకున్న హీరోయిన్ అలియాభ‌ట్ కాద‌ని... తాను ఒక‌ర్ని తీసుకోవాల‌నుకుంటే? క‌ర‌ణ్ జోహార్ త‌న‌ ద‌గ్గ‌ర‌కొచ్చి అలియాభ‌ట్ ని స‌జ్జెస్ట్ చేసినట్లు. దీంతో త‌ప్పక తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్న‌ట్లు వాస‌న్ బాలా వ్యాఖ్యానించారు.

దీంతో క‌ర‌ణ్‌ జోహార్ నెటి జ‌నుల‌కు టార్గెట్ అయ్యాడు. అలియాభ‌ట్ విష‌యంలో క‌ర‌ణ్ ఎందుక‌లా చీటికి మాటికి క‌ల్పించుకుంటున్నాడ‌నే చ‌ర్చ సాగింది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో హీరోయిన్ అంటే కేవ‌లం అలియా భ‌ట్ మాత్ర‌మేనా? మిగ‌తా కొత్త వారికి అవ‌కాశాలు ఇవ్వ‌రా? అన్న చ‌ర్చ సాగింది. అలాగే అలియాభ‌ట్ ని మెయిన్ లీడ్ కి ఎంపిక చేయ‌డానికి వాస‌న్ బాలా కూడా వ్య‌తిరేకంగా ఉన్నాడ‌ని అభిమానుల్లో చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ చిన్న పాటి వివాదం చినిగి చినిగి గాలి వాన‌లా మారింది. ఇదేదో పెద్ద వివాదంలా నెట్టింట క్రియేట్ అయింది. అయితే తాజాగా మరోసారి వాస‌న్ బాలా తాను అలియాభ‌ట్ కి వ్య‌తిరేకంగా చెప్ప‌డంగానీ, చేయ‌డం గానీ చేయ‌లేద‌న్నారు. అన‌వ‌స‌రంగా విష‌యాన్ని మీడియా త‌ప్పు దారి ప‌ట్టిస్తుంద‌న్నారు. రిలీజ్ ముందు ఇలాంటి వివాదాలు భావ్యం కాద‌న్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈనెల 11న జిగ్రా రిలీజ్ అవుతుంది.

అస‌లే అలియాభ‌ట్ పుల్ స్వింగ్ లో ఉంది. కొంత‌కాలంగా అమ్మ‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఈ నేప‌థ్యంలో `జిగ్రా` కూడా అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇందులో అలియాభ‌ట్ కి జోడీగా వేదాంగ్ రైనా న‌టించాడు.

Tags:    

Similar News