అంబానీ పెళ్లిలో కళ్లన్నీ ఈ హీరోయిన్‌పైనే!
తాజాగా దిశా పటానీ స్వయంగా ఈవెంట్ నుంచి యూనిక్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 6న జరిగిన అంబానీల స్టార్-స్టడెడ్ సంగీత్ వేడుక ఇప్పటికీ వేవ్స్ క్రియేట్ చేస్తోంది. వేడుక ఇన్ సైడ్ ఫోటోలు వీడియోలను నెటిజనులు షేర్ చేస్తుంటే అవన్నీ వైరల్ గా మారుతూనే ఉన్నా. సంగీత్ వేడుకకు హాజరైన సోషల్ మీడియా పర్సనాలిటీ ఓర్హాన్ అవత్రామణి అకా ఓర్రీ జూలై 11న అనన్య పాండే, మౌని రాయ్, దిశా పటానీ వంటి కథానాయికలతో ఉన్నప్పటి కొన్ని సరదా స్నాప్స్ ని షేర్ చేసాడు.
తాజాగా దిశా పటానీ స్వయంగా ఈవెంట్ నుంచి యూనిక్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. సంగీత్ వేడుకలో దిశా పటానీ ఎప్పటిలానే యూనిక్ లుక్ తో షో స్టాపర్ గా మారింది. ఈసారి దిశా ఎంపిక చేసుకున్న లెహంగా డిజైనర్ జాకెట్ స్టన్నర్ ఎలివేషన్ తో కట్టి పడేసాయి. బంగారం వజ్రాల ధగధగలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్రిస్టలైన్ స్పెషల్ డ్రెస్ లో దిశా పటానీ కళ్లు తిప్పుకోనివ్వని ట్రీట్ ఇచ్చింది. టాప్ హీరోయిన్స్ ఎందరు ఉన్నా కానీ.. ఈవెంట్ ఆద్యంతం అతిథుల కళ్లన్నీ దిశాపైనే ఫోకస్ చేసాయంటే దిశా ధగధగలు ఏ రేంజులో వర్కవుటయ్యాయో అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. అనంత్-రాధికల సంగీత్ ముంబైలోని NMACCలో నిర్వహించగా.. వేడుకకు సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, అనన్య వంటి ప్రముఖ బాలీవుడ్ తారలు హాజరయ్యారు. పాండే, ఖుషీ కపూర్, వేదంగ్ రైనా తదితరులు ఎటెండయ్యారు.
నేడు (జూలై 12న) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న విలాసవంతమైన పెళ్లి వేడుకకు బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా ప్రపంచ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా జోనాస్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ఇవాంకా ట్రంప్, బిల్ గేట్స్, హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్ సహా ఎందరో దిగ్గజాలు ఈ పెళ్లికి అటెండయ్యారు.
జూలై 13న పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్ వేడుక .. జూలై 14న రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్‌లో అడెలె, డ్రేక్ ప్రదర్శన ఇవ్వనున్నారు. డైలీ మెయిల్ UK ప్రకారం.. అంబానీ కుటుంబం ఈ జంట వివాహ వేడుకల కోసం $320 మిలియన్లు ఖర్చు చేసింది. ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం మరో ఇంత పెద్ద మొత్తాన్ని ఇప్పటికే ఖర్చు చేసారు. ఓవరాల్ గా పెళ్లి వేడుకలు ముగిసేప్పటికి మొత్తం భారతీయ కరెన్సీలో సుమారు రూ.5000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.