దివి బ్యాక్ పోజ్.. క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే..

తెలుగమ్మాయి, బిగ్ బాస్ బ్యూటీ దివికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే

Update: 2024-07-11 16:30 GMT

తెలుగమ్మాయి, బిగ్ బాస్ బ్యూటీ దివికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ షోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. సినిమాల్లోకి మెల్లగా ఎంట్రీ ఇచ్చింది. పలు చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. మహర్షి మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అదే సమయంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది.

ఇక హౌస్ లోకి వెళ్లి.. ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన అందంతో అందరినీ ఫ్లాట్ చేసింది. టాస్కులను అద్భుతంగా కంప్లీట్ చేసి.. చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారిపోయింది. టైటిల్ గెలుచుకోలేకపోయినా.. బుల్లితెర ప్రియుల మనసులు మాత్రం గెలుచుకుంది అమ్మడు. బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. వివిధ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి మెప్పించింది. లంబసింగి మూవీతో హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీలో మంచి స్కోప్ ఉన్న రోల్ ను చేస్తోంది దివి. దాంతోపాటు నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది బ్యూటీ. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను పలకరిస్తుంటోంది. కొత్త కొత్త పిక్స్ షేర్ చేసి ట్రెండింగ్ లో నిలుస్తుంటోంది దివి.

స్టార్ హీరోయిన్లకు సమానంగా అందంతో అలరిస్తుంటోంది. అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో ఫిదా చేస్తుంటోంది. జిమ్ వేర్ తోపాటు ట్రెడిషనల్ లుక్ లో పిక్స్ దిగి పోస్ట్ చేస్తుంటోంది. దివి జిమ్ వేర్ పిక్స్ కు వేరే లెవల్ లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మరోసారి జిమ్ వేర్ లో దిగిన పిక్స్ ను షేర్ చేసింది. మంచి నేచర్ లో పింక్ కలర్ ఔట్ ఫిట్ లో తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది. పొద్దుపొద్దున్నే యాక్షన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

పొడుగు కాళ్ల సుందరి.. కొత్త పిక్స్ లో అదిరిపోయింది. బ్యాక్ పోజుతో అందరినీ ఫ్లాట్ చేస్తోంది. తన నడుముతో మైండ్ బ్లాక్ చేస్తోంది. సన్నని చిరునవ్వుతో మాయ చేస్తోంది. ప్రస్తుతం దివి పిక్స్.. నెట్టంట వైరల్ గా మారాయి. కిర్రాక్ దివి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హీట్ పుట్టించిందని అంటున్నారు. దివి పోజులకు, లుక్స్ కు ఎవరైనా సింపుల్ గా క్లీన్ బౌల్డ్ అవ్వడం పక్కా అని చెబుతున్నారు.

Tags:    

Similar News