డబుల్ ఇస్మార్ట్ కోసం 'లైగర్' బాబులు వెయిటింగ్!

ఇక, పూరీ జగన్నాథ్ తమ పాత బకాయిలను సెటిల్ చేస్తారనే ఆశతో లైగర్ సినిమా బయ్యర్లు డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారట.

Update: 2024-02-05 12:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డేషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పూరి బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. ఇక లైగర్ తో డిజాస్టర్ మూటగట్టుకున్న పూరి.. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ను అనౌన్స్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం వీరి కాంబోలో డబుల్ ఇస్మార్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, రామ్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కోసం రామ్ తన బాడీని చూపిస్తూ ఆ మధ్య ఓ ఫొటోను పంచుకున్నారు. ఫ్యాట్ మొత్తం కరిగించి సిక్స్ ప్యాక్ తో అదరగొట్టారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ అప్డేట్స్ రానున్నట్లు పూరీ ఇటీవలే తెలిపారు.

అయితే లైగర్‌ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌ కు అనేక సవాళ్లు ఎదురయ్యాయని చెప్పొచ్చు. డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆడియో హక్కులు అమ్మేసినప్పటికీ, నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. చాలా మంది నిర్మాతలు పూరికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఛార్మీ నిర్మాణ భాగస్వామిగా ఉండడం నచ్చట్లేదట. అందుకే పూరియే పూర్తి నిర్మాణ బాధ్యతలు చేపట్టారట.

ఇక, పూరీ జగన్నాథ్ తమ పాత బకాయిలను సెటిల్ చేస్తారనే ఆశతో లైగర్ సినిమా బయ్యర్లు డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందో లేదో అని ఆలోచిస్తున్నారట. అన్నీ క్లియర్ అని, త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 8వ తేదీన ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్ సీన్‌ కోసం పూరి ఏకంగా రూ.7కోట్లు ఖర్చుపెట్టారట. సంజయ్‌ దత్‌, రామ్‌పై ఈ సన్నివేశం ఉండబోతుందట. ఇదే నిజమైతే ఈ ఫైట్‌ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల చేస్తున్నారు. మరి ఈ డబుల్ ఇస్మార్ట్.. డబుల్ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

 

Tags:    

Similar News