దుల్కర్.. తెలుగులో ఈ స్పిడేంటి బాబు!

అతను తెలుగులోనే ముగ్గురు నిర్మాతలతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Update: 2023-08-29 15:00 GMT

తెలుగు ఆడియన్స్ ని ఒక్కసారి కంటెంట్ తో మెప్పించాలే గాని ఏ భాషలోనివారైనా సరే ఇక్కడ మంచి క్రేజ్ అందుకుంటూ ఉంటారు. తమిళ హీరోలకు గత కొంతకాలంగా ఏ స్థాయిలో క్రేజ్ అందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడిప్పుడే మలయాళం ఇండస్ట్రీలో నుంచి కూడా కొంతమంది నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక దుల్కర్ సల్మాన్ అయితే ఇప్పుడు సొంత భాషలో కంటే తెలుగులోనే మంచి ఆఫర్లు అందుకుంటున్నాడు.

ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగులోకి వచ్చిన తర్వాతనే అతని ఆదాయం కూడా పెరిగింది. ఎందుకంటే అక్కడ సొంత భాషలో తక్కువ బడ్జెట్లో లిమిట్ పారితోషకంతో సినిమాలు చూసుకుంటూ వస్తున్న దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు తెలుగులో మాత్రం అక్కడికంటే ఎక్కువ స్థాయిలో పారితోషకం ఇచ్చి సినిమా అవకాశాలు అయితే ఇస్తున్నారు.

అతని నటన హ్యాండ్సమ్ లుక్స్ తెలుగు వారికి బాగా నచ్చేసాయి. మహానటి సినిమాలో అతను నటించిన విధానం చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఆ తర్వాత సీతారామం సినిమా తెలుగు జనులకు మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం అతను తెలుగులోనే ముగ్గురు నిర్మాతలతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఇటీవల అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ సినిమా షేర్ మార్కెట్ నేపథ్యంలో రాబోతోంది. అలాగే మరోవైపు ఏషియన్ సునీల్ ప్రొడక్షన్లో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అందులో రానా కూడా మరో హీరోగా నటించబోతున్నాడు. ఇక లిస్టులో నాగార్జునకు దగ్గర బంధువైన ప్రశాంతి నిర్మాతగా రూపొందించనున్న మరో సినిమాకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.

ఇక రీసెంట్గా మరో తెలుగు నిర్మాత సుధాకర్ చేరుకురితో కూడా దుల్కర్ సల్మాన్ సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. కొత్త దర్శకుడు చెప్పిన కథ అతనికి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా కొత్తగా మూడు ప్రాజెక్టులు అయితే తెలుగు నిర్మాతలతోనే చేస్తూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమాలు తమిళం మలయాళం భాషల్లో కూడా యధావిధిగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News