షేక్ చేస్తాడనుకుంటే ఇలా కూల్ చేసేసాడేంటి!
పఠాన్`..`జవాన్` విజయాలతో షారుక్ ఖాన్ ఇండియాని షేక్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు భారీ విజయాలు షారుక్ ని మళ్లీ రేసులోకి వచ్చాయి.
పఠాన్`..`జవాన్` విజయాలతో షారుక్ ఖాన్ ఇండియాని షేక్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు భారీ విజయాలు షారుక్ ని మళ్లీ రేసులోకి వచ్చాయి. దీంతో `డంకీ`తోనూ మరోసారి ఇండియాని షేక్ చేయడం ఖాయమనుకుంటున్నారంతా. `డంకీ`తోనూ హిట్ అందుకుని హ్యాట్రిక్ హీరోగా బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటుతాడని అంతా కాన్పిడెంట్ గా ఉన్నారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడు కావడంతో కంటెంట్ పైనా అంతే నమ్మకంగా ఉన్నారు.
కానీ తాజా సన్నివేశం చూస్తుంటే `డంకీ` కేవలం బాలీవుడ్ కే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్లు కనిపించలేదు. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రచార చిత్రాలన్ని కేవలం హిందీ వరకే పరిమితయ్యాయి. మరే భాషలోనూ వాటిని డబ్ చేయలేదు. సినిమాని అనువదిస్తున్నట్లు కూడా ఎక్కడా కథనాలు రాలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ కేవలం హిందీలోనే అని తెలుస్తోంది. రిలీజ్ కి సమయం కూడా దగ్గరపడుతుంది. ఇంకా 15 రోజులే సమయం ఉంది.
ఈ గ్యాప్ అనేది డబ్బింగ్ కి సరిపోయే సమయం కూడా కాదు. కాబట్టి `డంకీ` ఉత్తరాదికే పరిమితమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇది కేవలం హిందీ రీజియన్ రాష్ట్రాలకు మాత్రమే కంటెంట్ కనెక్ట్ అవుతుందని..ఇతర భాషలకు కనెక్ట్ అవ్వడం కష్టంమని అందుకనే డబ్ చేయలేదు అన్న ప్రచారం తెరపైకి వస్తోంది. ఇంతవరకూ హిరాణీ చిత్రాలేవి కూడా అనువదించింది లేదు.
గతంలో హిరాణీ తెరకెక్కించిన `త్రీ ఇడియట్స్` ని రీమేక్ చేసారు తప్ప అనువదించలేదు. అలాగే పీకే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు ప్రచారం సాగింది గానీ అలా చేసింది లేదు. షారుక్ ఖాన్ అన్ని రకాల ఇమేజ్ ఉన్న హీరో. అందులోనూ కామెడీ లోనూ ఖాన్ భాయ్ స్పెషలిస్ట్ . డంకీ ఆ తరహా చిత్రంలా అనిపిస్తుంది. కానీ పాన్ ఇండియాకి కనెక్ట్ చేయకుండా వదిలేస్తున్నారు? అంటే కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ నే హిరాణీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇది `సలార్` కి కలిసొచ్చే అంశమే. డంకీతో పాటు సలార్ కూడా అదే రోజు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.