అమెరికా- UK ప్రభుత్వాల కోసం 'డంకీ' షో
ఆసక్తికరంగా డంకీని UK ప్రభుత్వానికి ప్రదర్శించారని తాజాగా కథనాలొచ్చాయి.
షారుఖ్ ఖాన్ 'డంకీ` అద్భుత విజయంతో హ్యాట్రిక్ అందుకున్నాడు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన కామెడీ యాక్షన్ డ్రామా అక్రమ వలసలు అనే అంశాన్ని స్పర్శించింది. ఇది విమర్శనాత్మకంగా అలాగే వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సాధించింది. ఆసక్తికరంగా డంకీని UK ప్రభుత్వానికి ప్రదర్శించారని తాజాగా కథనాలొచ్చాయి. బ్రిటన్ సహా పలు దేశాలకు డంకీ షో వేసింది చిత్రబృందం.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం షారుఖ్ ఖాన్ నటించిన కామెడీ డ్రామా డంకీని ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రమాదకరమైన డంకీ మార్గం చిత్రీకరణ కారణంగా అక్రమ వలసల అంశాన్ని ప్రస్తుత కాలంలో బర్నింగ్ టాపిక్ గా బ్రిటీస్ ప్రభుత్వం పరిగణిస్తోందని సమాచారం. UKలో డంకీకి సానుకూల స్పందన లభించినందున, ప్రభుత్వ అధికారులు కూడా దీనిని చూడటానికి ఆసక్తి చూపగా ఈ ఏర్పాటు చేసారు.
వివిధ దేశాల కాన్సులేట్‌ల కోసం డంకీ ప్రత్యేక స్క్రీనింగ్ జరిగిందని తెలిసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, UK, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాల ప్రతినిధులతో డిసెంబర్ 28న డంకీ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. బెల్జియం, జర్మనీ, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, స్పెయిన్, టర్కీ, నెదర్లాండ్స్ నుండి ప్రతినిధులు కూడా ఈ షోకి హాజరైనట్లు సమాచారం. విదేశాలకు వెళ్లడానికి గాడిద మార్గంలో వెళ్లే అక్రమ వలసదారుల గురించిన చిత్రమిది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. డిసెంబర్ 28న వివిధ దేశాల కాన్సులేట్‌ల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది.
మున్నాభాయ్ చలే అమెరికా - డంకీ చిత్రాల మధ్య సమాంతర అంశాల గురించి హిరాణీ ఇంతకుముందు మాట్లాడారు. ఈ రెండు కథలకు సారూప్యత లేదని కూడా ఆయన అన్నారు. అది పూర్తిగా భిన్నమైన కథ అని తెలిపారు. డంకీ చిత్రానికి అభిజిత్ జోషి- కనికా ధిల్లాన్ రచయితలు. ఈ చిత్రంలో SRK, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, అనిల్ గ్రోవర్, బోమన్ ఇరానీ తదితరులు నటించారు. డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే గాక కమర్షియల్‌గానూ విజయాన్ని అందుకుంది.