శిల్పాశెట్టి దంపతుల ఆస్తులపై ఈడీ ఎటాక్!
బిట్ కాయిన్ కేసు వివరాల్లోకి వెళ్తే... ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్ను నిర్వహించింది.
బిట్ కాయిన్ మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఈడీ చర్యలకు దిగింది. ఆమె భర్త రాజ్ కుంద్రాకి చెందిన రూ. 97.79 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జుహూ ప్రాంతంలోని ఓ రెసిడెన్సీ ఫ్లాట్ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పూనేలోని ఓ బంగ్లా- రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో శిల్పా శెట్టి దంపతులు మళ్లీ విచారణ..కోర్టు అంటూ తిరగాల్సిన సమయం వచ్చినట్లుంది.
ఇప్పటికే నీలి చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అభియోగాలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఆకేసు విచారణలో ఉండగా కుంద్రా బెయిల్ పై బయట ఉన్నాడు. బయటకు వచ్చిన అనంతరం కొన్ని నెలలు పాటు ముఖానికి మాస్క్ ధరించి జనాల్లో తిరిగేవాడు.
బిట్ కాయిన్ కేసు వివరాల్లోకి వెళ్తే... ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్ను నిర్వహించింది. దీనిలో భాగంగా బిట్ కాయిన్ లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశచూపి ముంబై..ఢిల్లీ నగరాల ప్రజల నుంచి రూ. 6,600 కోట్లు వసూలు చేసింది.
ఆ తర్వాత సంస్థ మోసం చేయబడింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ప్రమోటర్లపై కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణం సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్‌కాయిన్లు తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ కాయిన్లు ఇప్పటికీ ఆయన వద్ద ఉన్నట్లు పేర్కొంది.
ప్రస్తుత మార్కెట్ ప్రకారం వాటి విలువ రూ. 150 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తోంది. వీటితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని పథకం వేసినట్లు వెల్లడించింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగానే రాజ్ కుంద్రాకి చెందిన 98 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మరి దీనిపై శిల్పాశెట్టి దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం శిల్పాశెట్టి కి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ప్రమెట్ అవుతోంది. ఇటీవలే కన్నడలో ఓ సినిమాకి సైన్ చేసింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.