శివన్నని బ్యాన్ చేస్తే పవనన్న పరిస్థితి ఏంటి?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలవుతోన్న సంగతి తెలిసిందే
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ ప్రకటనలతో కూడిన హోర్డింగులు.. కటౌట్లు.. పోస్టర్లను ఇప్పటికే తొలగిం చారు. ఉన్న చోట వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా కోడ్ అమలు కిందకు వచ్చే అన్ని అంశాలపై ఈసీ కొరడా ఝుళిపించి ముందుకెళ్తోంది. పార్టీల పరంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వంటివి కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పోస్టర్లని తొలగించాలని ఈసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయని ఆయన పోస్టర్లతో సంబంధం ఏంటి? అంటే శివరాజ్ కుమార్ భార్య గీత శివమొగ్గ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు. దీంతో భార్య తరుపును ఆ నియోజకవర్గంలోశివన్న క్యాపెనింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా పోస్టర్లు ఓటర్లపై ప్రభావం చూపుతాయని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
కమీషన్ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. అక్కడ గనుక శివన్న పోస్టర్లను తొలగిస్తే గనుక ఏపీలో జనసేన అధినేతన పవన్ కళ్యాన్ పైనా పంచ్ పడుతుంది. ఇంకా నటసింహ బాలకృష్ణ.. తమిళ నటుడు శరత్ కుమార్ పైనా ఎటాకింగ్ తప్పదు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానాని పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ నియోజక వర్గంలో పీకే మేనియా ఎలా ఉందో తెలిసిందే.
నియోజక వర్గంగా పవన్ సినిమా పోస్టర్ల కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్యనే రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రచార చిత్రాలు జోరుగా వైరల్ అవుతున్నాయి. వాటితోనూ అభిమానులు జనసేనకు ఓటు వేయాల ని ఇంటింట తిరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే నటుడు బాలకృష్ణ కూడా పోటీ చేస్తున్నారు. ఆయన పోస్టర్లు బయట కనిపిస్తున్నాయి. ఇక లోక్ సభకు బీజీపే తరుపున నటి రాధిక పోటీ చేస్తుంది. ఆమె పోస్టర్లు...భర్త శరత్ కుమార్ పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కోడ్ అమలు కిందకు వస్తే గనుక శివన్న పోస్టర్లను తొలగించాలని ఈసీ నిర్ణయిస్తే పంచ్ వీళ్లందరిపైనా పడుతుంది.