షూటింగ్ నుంచి ఏనుగు జంప్..!
సినిమాల్లో జంతువులను చూపిస్తే అది కూడా రియల్ ఏనుగులను చూపిస్తే చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎంజాయ్ చేస్తారు.
ప్రేక్షకులకు రియల్ థ్రిల్ కలిగించేందుకు కొన్నిసార్లు మేకర్స్ ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా యానిమల్స్ తో షూట్ ప్లానింగ్ ఉంటే దాదాపు అంతా గ్రాఫిక్స్ తోనే కానిచ్చేస్తారు. కానీ కొన్నిసార్లు మాత్రం రియల్ యానిమల్స్ ని తీసుకొస్తారు. ముఖ్యంగా ఏనుగు లాంటి వాటితో షూటింగ్ చేస్తుంటారు. కానీ దానికి ఒక ట్రైనర్ కచ్చితంగా ఉండాల్సిందే. సినిమాల్లో కనిపించే ఏనుగులన్నీ కేరళ నుంచి తీసుకొస్తారు. షూటింగ్ జరిగేంత వరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు.
ఏనుగు కేర్ టేకర్స్ కు కూడా అక్కడ ఉండేలా సకల సౌకర్యాలు కల్పిస్తారు. ఇదిలాఉంటే కొన్నిసార్లు ఎంత ట్రైనర్ ఉన్నా కొన్ని జంతువులు మాట వినకుండా మారాం చేస్తాయి. కొన్ని అక్కడ నుంచి ఎక్సేప్ అవ్వాలని చూస్తుంటాయి. లేటెస్ట్ గా అలానే ఒక తెలుగు సినిమా షూటింగ్ నుంచి సాధు అనే ఏనుగు షూటింగ్ నుంచి పారిపోయిందట. కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఒక సినిమా షూటింగ్ లో వెనక నుంచి మరో ఏనుగు రావడంతో సాధు అనే ఏనుగు భయపడి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లిందట.
ఐతే వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి ఆ ఏనుగుని పట్టుకున్నారు. షూటింగ్ లో ఇలాంటి ఊహించని విషయాలు జరిగినప్పుడు అక్కడ అంతా డిస్టర్బ్ గా ఉంటుంది. ఐతే ఏనుగు కంగారు పడటం వల్లే ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఏనుగు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని.. ఎవరికీ ఏమీ కాలేదని తెలుస్తుంది. మొత్తానికి ఏనుగే కదా అని రిలాక్స్ గా ఉంటే మాత్రం సీన్ మారిపోతుంది.
సినిమాల్లో జంతువులను చూపిస్తే అది కూడా రియల్ ఏనుగులను చూపిస్తే చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎంజాయ్ చేస్తారు. మన దగ్గర ఎక్కువగా కనిపించని జంతువులను వాటి నేపథ్యాన్ని సినిమా తెరపై చూస్తే ప్రేక్షకులు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. అలానే ఒక తెలుగు సినిమా కోసం సాధు అనే ఏనుగుతో షూట్ చేస్తుంటే అదేమో కంగారు పడి పారిపోయినంత పనిచేసిని. చిత్ర యూనిట్ వెంటనే అలర్ట్ గా ఉన్నారు కాబట్టి ఏనుగు తప్పిపోకుండా వెంటనే కాపాడగలిగారని తెలుస్తుంది.
తెర మీద కనిపించే సినిమా నచ్చిందా లేదా అన్నది ఒక్క మాటలో చెప్పేస్తాం కానీ ఇలా షూటింగ్ లో అనుకోని విషయాలు జరుగుతాయి వాటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేస్తారు. కానీ మనం పెట్టిన టికెట్ ఖర్చుకి తగిన ఎంటర్టైన్ లేకపోతే బాలేదని చెప్పడం వరకు ఓకే కానీ సినిమాలో అది బాలేదు ఇది బాలేదు అని ఏదో మనమే ఒక క్రియేటర్స్ గా రివ్యూ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పొచ్చు.