ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ప్ర‌ముఖ హీరోయిన్ విడాకులు!

ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో ఎవ‌రూహించెద‌రు? మ‌హానుభావుడు ఘంట‌సాల ఆలపించిన ఈ పాట ఎప్పుడూ ప్ర‌జ‌ల గుండెల్లో రింగుమంటూనే ఉంటుంది

Update: 2024-02-06 19:44 GMT

ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో ఎవ‌రూహించెద‌రు? మ‌హానుభావుడు ఘంట‌సాల ఆలపించిన ఈ పాట ఎప్పుడూ ప్ర‌జ‌ల గుండెల్లో రింగుమంటూనే ఉంటుంది. ఎప్పుడు ఎవ‌రి నోట ఏ మాట వినాల్సి వ‌స్తుందోన‌ని భ‌య‌ప‌డే ప‌రిస్థితి. ఇటీవలి కాలంలో విడిపోయిన జంట‌ల‌ను చూస్తే ఆవేద‌న చెంద‌ని వారు లేరు. అమీర్ ఖాన్- కిర‌ణ్ రావు, నాగ‌చైత‌న్య‌- స‌మంత, ఆర్భాజ్ - ఆండ్రియానీ, సానియా మిర్జా- షోయ‌బ్ మాలిక్.. ఇలా సెల‌బ్రిటీల బ్రేక‌ప్ వార్త‌లు హాట్ టాపిక్ గా మారాయి.

ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో జంట చేరింది. డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని పెద్ద‌ కుమార్తె ఈషా డియోల్ త‌న భ‌ర్త‌ భరత్ తఖ్తానీతో 12 సంవత్సరాల సంసారం అనంత‌రం విడిపోయామ‌ని ధృవీకరించారు. ఈ జంట 12 జూన్ 2012న ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. 12 సంవత్సరాల వివాహంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్ల‌ల విష‌యంలో త‌మ బాధ్య‌త‌ల‌ను విడిచిపెట్ట‌మ‌ని వారు ప్ర‌క‌టించారు.

కొంతకాలంగా బ్రేక‌ప్ పుకార్లు!

ఈ స్టార్ క‌పుల్ తరచూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంటారు. అయితే 2023లో జరిగిన ఈషా డియోల్ పుట్టినరోజు వేడుక నుండి ఆమె భ‌ర్త‌ భరత్ తప్పిపోవ‌డంతో అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఈషా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి తఖ్తానీ ఫోటోలన్నింటినీ తొలగించ‌డంతో విడిపోయినట్టు పుకార్లు వైర‌ల్ అయ్యాయి. అంతేకాకుండా ఒక నెటిజ‌న్ జనవరి 17 న రెడ్డిట్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. ఇషా - భరత్ ఇప్ప‌టికే విడిపోయారని తెలిపాడు. అందుకే ఇప్పుడు పబ్లిక్‌గా కలిసి కనిపించడం లేదని, తన జీవితంలో భరత్ ముందుకు సాగాడని కూడా రెడ్డిట్ అనుచ‌రుడు పేర్కొన్నారు.

కొత్త సంవత్సరం రోజున బెంగళూరులో జరిగిన పార్టీలో ఇషా భర్త భరత్‌ని చూసినట్లు స‌ద‌రు రెడ్డిట్ యూజర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అతడు తన ప్రియురాలితో అక్కడ ఉన్నాడు. అయితే ఈ వైరల్ వార్తపై డియోల్ కుటుంబం నుండి ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు విడాకుల‌ను అధికారికం చేసారు. ఈ జంట దశాబ్దానికి పైగా భార్యాభ‌ర్త‌లుగా సంసారం సాగించిన‌ తర్వాత తమ బ్రేక‌ప్ ని అధికారికంగా ధృవీకరించారు.

జూన్ 2012లో ఈషా డియోల్ భరత్‌ని వివాహం చేసుకున్నారు. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్‌లో వివాహం అత్యంత సింపుల్‌గా జరిగింది. వివాహం అయిన ఐదు సంవత్సరాల తరువాత ఈ జంట రాధ్య అనే కుమార్తెకు తల్లిదండ్రులు అయ్యారు. ఆపై 2019 సంవత్సరంలో ఇషా వారి రెండవ కుమార్తె మిరాయా తఖ్తానీకి జన్మనిచ్చింది.

Tags:    

Similar News