నిహారిక ఇంట‌ర్వ్యూపై మాజీ భ‌ర్త ప్ర‌తిస్పంద‌న‌

ఇంటర్వ్యూలో తన భర్త నుండి విడిపోయిన తరువాత అనుభవించిన బాధను, త‌న మ‌న‌సులోని మాట‌ను ఆవిష్క‌రించింది.

Update: 2024-01-26 13:44 GMT

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మొద‌టిసారి త‌న స‌న్నిహిత మిత్రుడు నిఖిల్ పాడ్ కాస్ట్ ఇంట‌ర్వ్యూలో త‌న వివాహం, మాజీ భ‌ర్త గురించి నిహారిక‌ వ్యాఖ్యానించారు. ``నేను చాలా ఇబ్బంది పడ్డాను.. ఊహించని విధంగా ఒక సంబంధం ముగింపును ఎదుర్కోవడం చాలా కష్టం`` అని అన్నారు. త‌న‌పై సోష‌ల్ మీడియా వ్యాఖ్య‌ల‌కు బాధ‌ప‌డ్డాన‌ని తెలిపారు.


భ‌ర్త గురించిన ఒక ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. ``త‌ప్పు వ్య‌క్తి.. ప్ర‌తి ఒక్క‌రూ అమ్మా నాన్న కాలేరు.. వారిలాగా జాగ్ర‌త్త‌గా చూసుకోలేరు`` అని నిహారిక ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూలో తన భర్త నుండి విడిపోయిన తరువాత అనుభవించిన బాధను, త‌న మ‌న‌సులోని మాట‌ను ఆవిష్క‌రించింది. సోష‌ల్ మీడియా కామెంట్ల‌కు తాను క‌ల‌త చెందిన‌ట్టు తెలిపారు. త‌న‌కు 60 వ‌య‌సు వ‌చ్చేంత‌వ‌ర‌కూ చూసుకునేంత మంచి తండ్రి ఉన్నార‌ని నిహారిక అన్నారు.

అయితే ఇది ఏక‌ప‌క్ష ప్ర‌చారం అంటూ చైత‌న్య జేవీ ప్ర‌తిస్పందించారు. ``నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన ప్రతికూలత(నెగెటివిటీ)ను దూరం చేయడానికి మీరు (ఇంట‌ర్వ్యూవ‌ర్ నిఖిల్) చేసిన ప్రయత్నాన్ని నిజంగా అభినందిస్తున్నాను. వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ మీరు పరోక్షంగా బాధితురాలి ట్యాగ్‌లను అటాచ్ చేయడానికి రీచ్ అండ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం మానేయండి.. వివాహం అనే అంకాన్ని గౌర‌విస్తూ`` అని చైతన్య తన వ్యాఖ్యలో పేర్కొన్నాడు.


Tags:    

Similar News