రెండు సినిమాల‌తోనే ఇంటికెళ్లిపోదామ‌నుకున్నా!

'ఒకటి తగ్గింది పుష్ప' అంటూ మ‌ల‌యాళం న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ ఎంత తెలుగింట ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు

Update: 2024-05-09 10:30 GMT

'ఒకటి తగ్గింది పుష్ప' అంటూ మ‌ల‌యాళం న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ ఎంత తెలుగింట ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ప' పార్ట్‌ -1'లో భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా ఫ‌హాద్ పెర్పార్మెన్స్ తోనే అది సాధ్య‌మైంది. అటుపై కొన్ని మ‌ల‌యాళ సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌రింత గుర్తింపు ద‌క్కిందిక్క‌డ‌. ప్రస్తుతం 'పుష్ప2'లో అదే పాత్ర‌లో కంటున్యూటీ ఉంటుంది. పుష్ప‌-షెకావ‌త్ పాత్ర‌ల మ‌ధ్య అస‌లైన వార్ ఎలా ఉంటుంద‌న్ని రెండ‌వ భాగంలో హైలైట్ అవుతుంది.

ఈగో ఫ్యాక్టర్ మీద రెండు పాత్ర‌లు నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతాయి. తాజాగా ఫ‌హాద్ ఓ ఇంట‌ర్వ్యూలో డ‌బ్బు ప్రాధాన్య‌త గురించి త‌న వృత్తిగ‌త జీవితం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. 'జీవితానికి డబ్బు అనేది అవసరం. కానీ అదే జీవితం కాదు. ప్రతి దానికి అదొక ఒక కారణం.నేను ఇంటి నుంచి బయటకు వచ్చి చేసే పని ఏదైనా నాలో ఉత్సాహం ఇచ్చేదిగా ఉండాలి. సుకుమార్‌ సర్‌తో కలిసి పనిచేయడం బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్.

భన్వర్‌సింగ్‌ పాత్రకు ఎవరైతే సరిపోతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే నేను సినిమాలో ఉన్నా. మేమంతా కలిసి ఒక భారీ ఇండియన్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ చేస్తున్నాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నేను సినిమా సెట్‌కు వెళ్తాను. ఆ పాత్రను అంతే ఆస్వాదిస్తున్నా. కానీ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విలన్‌ను అవుతానో? లేదో మాత్రం తెలియదు. కేవలం డబ్బు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదు. 'కుంబలంగి'..' నైట్స్‌'- 'ట్రాన్స్‌' సినిమాలతో బాగానే సంపాదించా.

నటన ద్వారా డబ్బులు సంపాదించాలని నేను అనుకోను. సినిమాల మీద ఫ్యాష‌న్ తో వ‌చ్చిన వాళ్ల‌కు అలా అనిపించ‌దు అని నా అభిప్రాయం. 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చా. కానీ ఇక్క‌డ లైఫ్ కి గ్యారెంటీ లేదు. ఇక ఆర్థిక అస్థిరత్వాన్ని నేను సమర్థంగా ఎదుర్కోగలను. కేవలం రెండు సినిమాలని చేసి వెళ్లిపోవాలనుకున్నా. కానీ అదే వృత్తిగా కొన‌సాగుతున్నా. స‌క్సెస్ అయ్యాను కాబ‌ట్టే ఇదంతా. లేదంటే? షెకావ‌త్ లేడు...మ‌ల‌యాళంలో ప‌హాద్ కూడా ఉండేవాడు కాదు' అని అన్నారు.

Tags:    

Similar News