ఫహాద్, పుష్ప మేకర్స్.. ఏం జరిగింది?

ఎస్పీ భన్వర్‌ సింగ్ షెకావత్‌ రోల్ లో కనిపించి అదరగొట్టారు. ఇప్పుడు పుష్ప-2లో కూడా ఆయన నటిస్తున్నారు.

Update: 2024-06-19 06:04 GMT

మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మలయాళంతో పాటు తమిళ్, తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. మెయిన్ గా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాలో తనదైన యాక్టింగ్ తో అలరించారు. ఎస్పీ భన్వర్‌ సింగ్ షెకావత్‌ రోల్ లో కనిపించి అదరగొట్టారు. ఇప్పుడు పుష్ప-2లో కూడా ఆయన నటిస్తున్నారు.

అయితే ఫస్ట్ పార్ట్ లో కాసేపే కనిపించిన ఫహాద్.. సీక్వెల్ లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు ఆయనకు మధ్య చాలా యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వడమే లక్ష్యంగా డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో పుష్ప సీక్వెల్ పోస్ట్ పోన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విడుదల వాయిదాకు షూటింగ్ పెండింగ్ ఉండడమే కారణమని మేకర్స్ చెబుతున్నా.. నెట్టింట మాత్రం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఫహాద్ పాజిల్ కూడా పోస్ట్ పోన్ అవ్వడానికి ఒక కారణమని టాక్ నడుస్తోంది. ఆయన జనవరి, ఫిబ్రవరిలో సినిమా కోసం డేట్లు కేటాయించారట. కానీ సుకుమార్ కొన్ని కారణాల వల్ల షెడ్యూల్ ఛేంజ్ చేశారని, దీంతో ఫహాద్ డేట్స్ వేస్ట్ అయ్యాయని తెలుస్తోంది. అప్పుడు ఫహాద్ డిస్సపాయింట్ అయ్యారని టాక్.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఫహాద్.. ఆ తర్వాత పుష్ప-2 మేకర్స్ కు డేట్స్ కేటాయించలేదని తెలుస్తోంది. అలా షూటింగ్ పెండింగ్ లో ఉండిపోయిందని సమాచారం. అయితే ఇగోస్ క్లాష్ అవ్వడం వల్లే ఫహాద్ డేట్స్ ఇవ్వలేదని వినికిడి. రీసెంట్ గా ఆయన పుష్ప-2 సెట్స్ లో అడుగుపెట్టారట. కొన్ని రోజుల్లో ఆయన పార్ట్ కంప్లీట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అలా పుష్ప-2 పోస్ట్ పోన్ కు ఫహాద్ కూడా ఓ కారణమని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం పుష్ప మూవీతో తనలో, తన కెరీర్ లో ఎలాంటి ఛేంజ్ రాలేదంటూ ఫహాద్ ఫాజిల్ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయం సుకుమార్ కు చెప్పానని, ఇందులో దాచుకోవాల్సిందేం లేదని అన్నారు. ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని తెలిపారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఫహాద్ కూడా పోస్ట్ పోన్ కు కారణమన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి సీక్వెల్ లో ఆయన రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News