టాలీవుడ్ లో మాలీవుడ్ విల‌నిజం!

అటుపై కాల‌క్ర‌మంలో తెలుగు హీరోలే శ్రీకాంత్..జ‌గ‌ప‌తి బాబు లాంటి వారు విల‌న్ల‌గా ట‌ర్న్ అవ్వ‌డంతో బాలీవుడ్ న‌టుల కాస్త త‌గ్గింది.

Update: 2024-05-15 17:30 GMT

ఒక‌ప్పుడు తెలుగు సినిమాలో విల‌న్ అంటే హిందీ న‌టులు క‌నిపించారు. ద‌శాబ్ధాల పాటు ఈ ట్రెండ్ కొన‌సాగింది. తెలుగు ప్రేక్ష‌కులు వాళ్ల‌ని అలాగే ఆద‌రించారు. భాష‌తో సంబంధం లేకుండా ఆద‌రించారు కాబ‌ట్టే అంతగా ఫేమ‌స్ అయ్యారు. అటుపై కాల‌క్ర‌మంలో తెలుగు హీరోలే శ్రీకాంత్..జ‌గ‌ప‌తి బాబు లాంటి వారు విల‌న్ల‌గా ట‌ర్న్ అవ్వ‌డంతో బాలీవుడ్ న‌టుల కాస్త త‌గ్గింది. కొన్నాళ్ల పాటు వీళ్లు సీరియ‌స్ విల‌న్లుగా సేవ‌లందించారు. అయితే ఇప్పుడీ ట్రెండ్ కూడా పాత‌దైంది.


తాజాగా టాలీవుడ్ లో విల‌న్ల హ‌వా ఎవ‌రిది? అంటే మాలీవుడ్ న‌టుల‌దే క‌నిపిస్తుంది. ఒక‌ప్పుడు మ‌ల‌యాళం హీరోలు చేసిన సినిమాలే తెలుగులో అనువాద‌మయ్యేవి. మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపీ లాంటి వారు అలా ప‌రిచ‌య‌మైన‌వారే. అటుపై మలయాళం నుంచి కథానాయికలు రావడం ఎక్కువైంది. అయితే వారు ఇక్క‌డ నిల‌దొక్కుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఈ మ‌ధ్య కాలంలోనే వాళ్ల‌కు స‌క్సెస్ రేట్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. దీంతో మలయాళం భామ‌ల వెల్లువ అంత‌కంత‌కు ఎక్కువ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలోనే విల‌న్ల ఎంట్రీ కూడా పెరుగుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ .. ఫహాద్ ఫాసిల్ .. జోజు జార్జ్ .. షైన్ టామ్ చాకో వంటి వారు ఇక్కడి స‌త్తా చాటుతున్నారు. పృథ్వీరాజ్ చాలా అనువాద సినిమాల‌తో టాలీవుడ్ కి బాగా సుప‌రిచిత‌మైన న‌టుడు అన్న సంగ‌తి తెలిసిందే. స‌లార్ సినిమాతో మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు. ప్ర‌స్తుతం స‌లార్ -2 లో న‌టిస్తున్నాడు. అలాగే ఫ‌హాద్ ఫాజిల్ ఎంతో ట్యాలెంటెడ్ యాక్ట‌ర్. అయినా పుష్ప రిలీజ్ వ‌ర‌కూ అత‌నెవ‌రో తెలుగు ఆడియ‌న్స్ కి తెలియ‌దు. ఈ సినిమ అత‌నికి ఇక్క‌డ మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ప్ర‌స్తుతం 'పుష్ప‌-2' లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాల త‌ర్వాత పృథ్వీ...ప‌హాద్ ల‌కు విల‌న్ల‌గా మంచి అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ద‌స‌రా సినిమాలో విల‌న్ గా న‌టించిన షైన్ టామ్ చాకో తెలిసిన న‌టుడే. వైవిథ్య‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు. అటుపై 'రంగబలి' లోనూ న‌టించాడు. ప్రస్తుతం బాలకృష్ణ - బాబీ సినిమాలోనూ న‌టిస్తున్నాడు. అలాగూ 'సలార్ 2' లోనూ ఛాన్స్ అందుకున్నాడు. మరో రెండు మూడు కొత్త ప్రాజెక్టులలోను అతని పేరు వినిపిస్తోంది. వీళ్ల‌ను చూసి మ‌రింత మంది మ‌ల‌యాళ న‌టులు తెలుగు అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News