భారత్ - పాకిస్తాన్ వివాదం.. 'ఫైటర్' కి కోట్లలో నష్టాలు?
బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన తాజా చిత్రం 'ఫైటర్'
బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన తాజా చిత్రం 'ఫైటర్'. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ - హృతిక్ రోషన్ కాంబినేషన్లో బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో ఫైటర్ పై అంచనాలు పెరిగిపోయాయి.
రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలను బ్యాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గల్ఫ్ దేశాల్లో ఒక్క UAE మినహా మిగతా ఆరు దేశాలు ఫైటర్ మూవీ విడుదలను నిషేధించాయి.
సినిమాలో తీవ్రవాదం, భారత్ - పాకిస్తాన్ మధ్య వివాదాలకు సంబంధించిన సన్నీవేషాలు ఎక్కువగా ఉండటంతో గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలను నిషేధించినట్లు తెలిసింది. ఇది కాస్త ఫైటర్ మూవీకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తాజా సమాచారం ప్రకారం యూఏఈ లోనూ ఫైటర్ మూవీ విడుదలను నిషేధించమని గల్ఫ్ అధికారులు అభ్యర్థించడంతో గల్ఫ్ లోని అన్ని మెయిన్ చైన్స్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని రిమూవ్ చేశారు.
దాంతో ఫైటర్ మూవీకి కోట్ల రూపాయల్లో నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని మిడిల్ ఈస్ట్ లో ఫైటర్ విడుదలను నిషేధించారు. నిజానికి ఓవర్సీస్ లో బాలీవుడ్ సినిమాలకి స్ట్రాంగ్ కలెక్షన్స్ వచ్చేది ఇక్కడి నుంచే. హృతిక్ రోషన్ గత చిత్రం 'వార్' ఓవర్సీస్ లోని మిడిల్ ఈస్ట్ నుంచే సుమారు 4.5 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది. అలాంటి స్ట్రాంగెస్ట్ ఏరియాలో ఫైటర్ విడుదల కాకపోవడం సినిమాకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు.
ఫైటర్ మూవీని అన్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేయడం సినిమా కలెక్షన్స్ పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ఫైటర్ ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. మేకర్స్ ఈ ఒక్క సినిమాతో ఆగకుండా ఓ ఫ్రాంచైజీనే చేశారు. అందులో మొదటి సినిమాగా 'ఫైటర్' రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఇదే ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు రాబోతున్నట్లు సమాచారం.