డల్లాస్ లో రామ్ చరణ్.. డిస్సపాయింట్ చేయనంటూ..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. తెలుగమ్మాయి అంజలి లీడ్ రోల్ పోషిస్తున్నారు.

Update: 2024-12-21 08:26 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. తెలుగమ్మాయి అంజలి లీడ్ రోల్ పోషిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్ జే సూర్య ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ ఇప్పటికే పూర్తి చేసేశారు. అదే సమయంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్.

అందులో భాగంగా అమెరికాలోని డల్లాస్ లో సందడి చేశారు. ఆ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడారు. "సంక్రాంతి నాకు, రాజు గారికి చాలా స్పెషల్.. దాదాపు 2 వేల రోజుల తర్వాత నా సోలో సినిమా విడుదలవుతుంది. నాలుగేళ్లు తర్వాత వస్తున్నా.. చివరగా ఆర్ఆర్ఆర్ తో మీ ముందుకు వచ్చా" అని తెలిపారు.

"అప్పుడు నా బ్రదర్ తారక్ తో కలిసి యాక్ట్ చేశా.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డా.. శంకర్ గారి స్టైల్ ను సంక్రాంతికి చూడబోతున్నాం. ఫ్యాన్స్ ను నేను ఎప్పుడూ నిరాశపరచను" అంటూ చరణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై యాక్షన్ సీన్స్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌ లో రామ్ చరణ్‌ ను మేకర్స్ చూపించారు. సినిమాలో ఆయన విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన జరగండి, రా మచ్చా, జానా హైరానా సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చార్ట్ బస్టర్స్ గా నిలిచిన ఆ పాటలు.. సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. నాలుగో సాంగ్ డోప్ ను త్వరలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. మరి గేమ్ ఛేంజర్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News