గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అదిరిపోయే ఛాన్స్
అయితే ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన టిల్లు స్క్వేర్ రిజల్ట్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి మంచి బెనిఫిట్ గా మారనుంది.
తెలుగు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకుపోతున్నారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. రీసెంట్ గా గామి మూవీతో వచ్చి అదరగొట్టేశారు. ఎవరూ చేయడానికి సాహసించని రోల్ ను సెలెక్ట్ చేసుకుని మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తన నటనతో సినీ విమర్శకులను కూడా అబ్బురపరిచారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనున్నారు.
ఛల్ మోహన్ రంగ ఫేమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మే17వ తేదీన విడుదల కానుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో విలేజ్ పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్.. కోనసీమ కుర్రాడిగా కనిపించనున్నారు.
అయితే ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన టిల్లు స్క్వేర్ రిజల్ట్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి మంచి బెనిఫిట్ గా మారనుంది. ఈ రెండు చిత్రాలను నిర్మించింది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థనే. ఈ బ్యానర్ లో కొద్ది రోజుల క్రితం వచ్చిన ఆదికేశవ చిత్రం డిజాస్టర్ అయింది. దీంతో నాగవంశీ స్టోరీ ఎంపిక ఎందుకు మిస్ అయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన గుంటూరు కారం మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. తప్పంతా త్రివిక్రమ్ వైపే మళ్లింది.
ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీతో సితార సంస్థ మంచి లాభాలను అందుకుంటోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా.. ఇప్పటి వరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. టిల్లు డైలాగ్స్, కామెడీకి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. దీంతో నాగవంశీ రూటే వేరని సినీ పండితులు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయ్యే చిత్రాలను ఎంచుకుంటారని మరోసారి ప్రూవ్ చేశారని అంటున్నారు.
ఇప్పుడు సితార సంస్థపై క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్స్.. ఆ బ్యానర్ లో వచ్చే కొత్త సినిమాలకు బెనిఫిట్ గా మారనున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ లైనప్ లో ఉన్న నెక్స్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ తో పాటు హీరోయిన్లు నేహా శెట్టి, అంజలి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా టిల్లు గాడి అడ్వాంటేజ్ ను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.