హిట్టిచ్చిన కాంబినేషన్లో బాలయ్య మాస్ ప్లాన్
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా ఒక ప్రాజెక్ట్ వెంటనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీనిచ్చి సత్తా చాటుతున్నారు. రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు.
బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ తో సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య.. సక్సెస్ ట్రాక్ ను కొనసాగించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇప్పుడు డాకుతో వరుస హిట్స్ ను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ఇటీవల సినీ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న ఆయనకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. దీంతో హ్యాపీ మోడ్ లో ఉన్నారు.
అయితే బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ 2 తాండవం ప్రాజెక్టును ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. అవైటెడ్ సీక్వెల్ గా రానున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. మహాశివరాత్రి కానుకగా బాలయ్య పవర్ఫుల్ లుక్ ను రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. అందుకు గాన బోయపాటి ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారం.
అదే సమయంలో అప్ కమింగ్ సినిమాల విషయంలో బాలయ్య దూకుడుగా ఉన్నారన్న విషయం తెలిసిందే. పలువురు డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టును లైనప్ లో చేర్చుకున్నారని తెలుస్తోంది. ఆ మూవీ కోసం తనకు ఇప్పటికే హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చారని సమాచారం.
గతంలో వీర సింహా రెడ్డి మూవీకి గాను.. బాలయ్య, గోపీచంద్ మలినేని వర్క్ చేసిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మరో మూవీని నటసింహంతో చేసేందుకు గోపీచంద్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు గాను చాలా రోజుల క్రితమే బాలయ్యకు స్టోరీ వినిపించగా.. ఆయన ఓకే చెప్పేశారట.
హిట్ కాంబోలో వస్తున్న ఆ రెండో ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్, షైన్ స్క్రీన్స్, SLV సినిమాస్ వంటి సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మైత్రీ సంస్థనే ఆ సినిమాను రూపొందించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని ప్రస్తుతం సన్నీ డియోల్ జాట్ చిత్రంతో.. బాలయ్య అఖండ-2తో బిజీగా ఉన్నారు. ఆ రెండు కంప్లీట్ అయ్యాక.. వారి కాంబోలో మూవీ స్టార్ట్ అవ్వనుందట.