క‌ల‌క‌త్తా కాళీమాత‌పై సినిమా.. న‌టికి బెదిరింపులు

ఈ ప్ర‌చారం దేనికి? అంటే.. త్వ‌ర‌లో రానున్న‌ హిందీ చిత్రం 'మా కాళి: ది స్టోరీ ఆఫ్ మదర్‌ల్యాండ్' ప్రచార పోస్టర్‌లలో ఇది ఒకటి

Update: 2024-04-07 13:30 GMT

''న్యూస్‌ప్రింట్ పసుపు రంగులో ఉంది.. ఒక కుటుంబం ఫోటో వాడిపోయింది.. కానీ అక్షరాలు పెద్దవిగా, నల్ల‌గా బోల్డ్‌గా ఆక‌ర్షిస్తున్నాయి.. ఘోష్ కుటుంబం.. 16 ఆగస్టు 1946 నుండి అదృశ్యమైంది... దగ్గరగా చూడండి.. మరికొన్ని దృష్టిలో పడతాయి.. హత్య , కక్ష , దోపిడీ, దహనం..దాదాపు 6,000 మంది వ్యక్తులను చంపేసారు''.

ఈ ప్ర‌చారం దేనికి? అంటే.. త్వ‌ర‌లో రానున్న‌ హిందీ చిత్రం 'మా కాళి: ది స్టోరీ ఆఫ్ మదర్‌ల్యాండ్' ప్రచార పోస్టర్‌లలో ఇది ఒకటి. ఈ చిత్రంలో బెంగాలీ నటి రైమా సేన్ కోల్ క‌తా వాసి అపరాజిత ఘోష్‌గా నటించారు. 16 ఆగస్టు 1946న కలకత్తాలో చెలరేగిన భయంకరమైన మత హింసలో చిక్కుకున్న కల్పిత తల్లి భార్య పాత్ర ఇది. 'గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్‌' అని కూడా ఈ సినిమాని పిలుస్తున్నారు. ఈ అల్లర్లు చాలా రోజుల పాటు కొన‌సాగాయి. వేలాది మందిని చంపాయి. కమ్యూనిటీల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. ప్రత్యేక ముస్లిం మాతృభూమిని డిమాండ్ చేయడానికి 'డైరెక్ట్ యాక్షన్ డే' కోసం ముస్లిం లీగ్ పిలుపునివ్వ‌డంతో మండిపడిన హిందువుల పోరాటం నేప‌థ్యం ఉంది. ఈ రక్తపాత అధ్యాయం మరోసారి విభజన సంఘర్షణకు మూలంగా నిలిచింది.

తెలుగు ద‌ర్శ‌కుడు విజయ్ యెలకంటి దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. పశ్చిమ బెంగాల్ కి చెందిన‌ చెరిపేసిన చరిత్ర గురించి ఇది తెలియజేయ‌నుంది. అయితే దీనిని ప్రజలను ఆక‌ర్షించడానికి బాధాకరమైన గతాన్ని ఉపయోగించుకునే మరో మితవాద 'ప్రచార' చిత్రంగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు రావ‌డాన్ని త‌ప్పుప‌డుతున్నారు. 'మా కాళి'ని ఈ ఏడాది చివర్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నప్పటికీ ఈ సినిమా ప్రచార సామగ్రి ఇప్పటికే ముఖ్యంగా బెంగాల్‌లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది.

న‌టి రైమా సేన్ మాట్లాడుతూ.. చాలా వరకు రాళ్లు త‌న‌పైనే వేస్తున్నార‌ని ఎదురుదెబ్బలు తనకు త‌గులుతున్నాయ‌ని అన్నారు. కేవలం ఆన్‌లైన్ విట్రియోల్‌కు మాత్రమే పరిమితం కాకుండా 'బెదిరింపు కాల్స్' వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఇటీవ‌ల సేన్ తన ల్యాండ్‌లైన్ ఫోన్ మోగడం ఆగడం లేదని తాను లేదా కుటుంబ సభ్యులు ఫోన్‌ ఎత్తిన ప్రతిసారీ 'గ్రేట్ కలకత్తా హత్య'లపై చిత్రంలో ఎందుకు న‌టిస్తున్నావ‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని, అసభ్యంగా మాట్లాడుతున్నార‌ని రైమా తెలిపారు. అయితే నన్ను వేధించే వారు తీర్పు చెప్పే ముందు సినిమా చూడమని చెప్పాలనుకుంటున్నాను. ఆగస్ట్ 1946లో జరిగిన సంఘటనలను పెద్ద తెరపై చూపించాల్సిన అవసరం ఉంది అని సేన్ చెప్పారు. వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్' (2023).. రాజకీయ ఎజెండాను ప్రచారం చేసినందుకు కూడా విమర్శలు ఎదుర్కొంది.

దర్శకుడు యెలకంటి వివ‌ర‌ణ‌ ప్రకారం -''మా కాళి చిత్రం ఘోష్ కుటుంబ క‌థ‌ను చెబుతుంది. ఆ కుటంబీకుల క‌థ‌ను చెబుతూనే..మత హింస.. రాజకీయ గందరగోళం నేపథ్యానికి వ్యతిరేకంగా చరిత్రలోని కష్టాలు విషాదాలను తెలుసుకునేవిధంగా సినిమా ఉంటుంది'' అని అన్నారు. ఘోష్‌లు కల్పితం అయితే, ఆగస్ట్ 1946 అల్లర్ల సమయంలో ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్న అనేక నిజ జీవిత కుటుంబాలను తన పరిశోధన వెలికితీసిందని యెల‌కంటి చెప్పారు.

సైకలాజికల్ థ్రిల్లర్ W/O రామ్ (2018) కి దర్శకత్వం వహించిన యెల‌కంటి.. ఇప్పుడు ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మయ్యారు. దాదాపు 80 సంవత్సరాల క్రితం జరిగిన అల్లర్ల ప్రభావాలు బెంగాల్‌లో ఇప్ప‌టికీ కొనసాగుతున్నాయని ఆయ‌న‌ పేర్కొన్నారు. బెంగాల్‌లో హింసాత్మక చక్రం ఎప్పుడూ ఆగలేదు అని యెలకంటి అన్నారు. 1946 వరకు, 1947 విభజన, 1971 స్వాతంత్య్ర‌ యుద్ధం వరకు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా మారినప్పుడు, మత విద్వేషం హింస అనే అంతులేని చక్రంలో హిందూ కుటుంబాలు నలిగిపోయాయి. ఆ కథను ఎవరో ఒక‌రు చెప్పాలి అని అన్నారు.

Tags:    

Similar News